Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 5

   వలచి వచ్చిన వనిత

-వసుంధర

 

పార్ట్ - 5

 


    నేను సినిమాపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. ఆమె ప్రవర్తనలో నాలో క్రమక్రమంగా అదోకరకమైన ఆవేశం చోటు చేసుకోసాగింది. ఆఖరికి ఒకపర్యాయం ఆమె నాచేతిని తన చేతిలోకి తీసుకొని వంగి మృదువుగా పెదిమలతో స్పృశించింది. నా ఆవేశం కట్టలుతెంచుకుంది. ఆమె భుజాలమీదకు చేతులు పోనిచ్చి ఒకసారి దగ్గరగా లాక్కున్నాను. కుర్చీ అడ్డు రాకపోతే నా ఆవేశపు బలానికి ఆమె నాలో ఐక్యం కావలసిందే!

    "వాడికి మూడింది!" అన్నమాటలు నాచెవిలో పడగా ఉలిక్కిపడ్డాను. ఎదురుగా వెండితెరపై విలన్ ఆమాటలు అన్నాడు. ఆవిలన్ స్ధానంలో నాకు శ్రీధరబాబు  కనపడ్డాడు. చావుదెబ్బతిని ఓమూల పడిఉన్న పుల్లారావుకూడా నాకళ్ళముందు మెదుల్తున్నాడు.

    కేవలం నోటి దురుసుతనం కారణంగా సుదర్శనం, పుల్లారావులాంటివాళ్ళు శ్రీధరబాబు ఆగ్రహానికి గురయ్యారు. చేనింకా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. ఫలితం ఎలాగుటుందో?

    వయసు _ ఆహ్వానించే అందమైన యువతి! ఈ  రెంటికీ అయస్కాంతం, ఇనుములాంటి సంబంధముందేమో! నేను పార్వతికి లొంగిపోతున్నట్లు గ్రహిస్తూనే__అసలు పార్వతి ఈ  విధంగా ప్రవర్తించడానికి కారణమేమై యుంటుందా అని కూడా  ఆలోచిస్తున్నాను. కొంపదీసి ఇదేమైనా పెద్దపథకం కాదుగదా అని నాకు అనింపించసాగింది. శ్రీధరబాబు ఆగ్రహానికి నన్ను గురిచేసి - అతను నన్ను హత్యచేసే పరిస్ధితికి దారితీసే సంఘటన ఏర్పడ్డానికి పార్వతికాని ప్రవర్తించడం లేదుకదా అన్న  అనుమానం  నాకు  కలిగింది. అయితే  అందుకు  కారణమేమై ఉంటుంది? నా శతృవు ఎవడైనా  పార్వతికి ప్రియుడై ఉండవచ్చు. వాడి కోరికపై ఈమె ఇలా  ప్రవరిస్తుండవచ్చు.

    ఎంత ఆలోచించినా నాకు ఇంత పథకంవేసి  నన్ను చంపదల్చుకునేటంత శతృవెవడుంటాడో తోచలేదు. నా అనుమానం అర్ధ రహితమనికూడా అనిపించింది. పార్వతివంటి అందమైన అమాయకమైన ఆడపిల్ల ప్రవర్తన వెనుక నేరాన్ని ఊహించడం ఘోరమని కూడా నాకు తోచింది ............

    సినిమా అయిపోయింది.

    రిక్షాలో ఇద్దరం ఇంటిదగ్గరదిగాక ఆమె తనకున్న  భయాన్ని  వివరించింది. నాకుతెలుసు-ఆ రోజు  రాత్రి ఇద్దరం  ఒకేఇంట్లో నిద్ర చెయ్యవలసివస్తుందని!

    ఇద్దరం చేరోగదిలో నిద్రకుపడ్డాం. కేవలం ఇరవై నిముషాలు  మాత్రమె  వ్యవధిఇచ్చి - ఆమె భయంభయంగా నా గదిలోకి  పరుగెత్తుకువచ్చింది. నాకు తెలుసు - ఆమె అలా చేసే  అవకాశమున్నదని!

    ఒకే గదిలో ఇద్దరం చెరోప్రక్కపై నిద్రలోపడ్డాం నాకు తెలుసు __ మరికొద్ది క్షణాలలో ఏమి జరుగనున్నదీ!

        6

    సరిగ్గా అదే జరిగింది!!

    చాలా మామూలుగా తెల్లవారింది. నేను నామీదఉన్న ఆమె  చేతిని  పక్కకు పెట్టి లేచాను.

    నాకిప్పుడు  శ్రీధరబాబు ఏదో చేస్తాడన్న భయంకంటె అతను త్వరగా వచ్చేస్తాడే మోనన్న బెంగ ఎక్కువగా ఉంది. రాత్రి నా అనుభవం అపూర్వం. ఆ అనుభవం నాకు ఇంకా  ఇంకా! కావాలి. ఇంక  శ్రీధరబాబు రావడానికి ఎంతో వ్యవధి లేదు, నాకు పగలల్లా  ఆఫీసుపని తప్పనిసరి.......

    సుమారు మూడురోజులు గడిచాక శ్రీధరబాబు దగ్గర  నుంచి ఒక కార్డు వచ్చింది.  తనపని ఇంకా  కాలేదనీ బహుశా మరి వారంరోజులవరకు  తను  రాలేకపోవచ్చుననీ  అతను రాశాడు ఈ విషయం పార్వతికి చెప్పగా  ఆమె కంగారును వ్యక్తవరుస్తూ "పెద్ద ఇబ్బంది వచ్చిందే!" అని ఊరుకుంది.

    నాకేమి ఇబ్బంది అనిపించలేదు, ఆ కార్డు ఇచ్చిన  బలంతో ఆమెని మరికాస్త  దగ్గరగా  లాక్కుని _ "ఇది దేవుడు  నాకిచ్చిన  అపూర్వవకాశం  అన్నాను. ఆమె నావంక ప్రేమగా చూస్తూ_" మీరు  మరోలా అనుకోనంటే అడుగుతాను. అన్నయ్య  వచ్చేవరకు నాకు కాస్త డబ్బు సర్దగలరా?" అంది.

    నాకు జాలికలిగి "ఎంతేమిటి ?" అన్నాను.

    "చిన్న  మొత్తమయితే నాకు బెంగలేదు. ఈ రోజు  నేను  సాయంత్రం  నాలుగు  గంటల లోపులో ఒక నెక్ లెస్  కొనుక్కో వలసి ఉన్నది. అసలు  నేను అన్నయ్య దగ్గరకి  వచ్చినదే అందుకు-"

    "నాకు సరిగ్గా అర్ధం కాలేదు. నెక్ లెస్ కొనుక్కోవడానికి ఒక ప్రత్యేక  మైన టైమెందుకు?" అన్నాను.

    ఆమె వివరించింది. ఆమె స్నేహితురాలు అదేరకం నగను ఈ ఊళ్ళో, ఒక స్మగ్లీంగ్ వ్యాపారస్తుని దగ్గర   కొంది. పార్వతి అభిలాష విన్నాక ఆమె స్నేహితురాలు తనకు తెలిసిన  వారిద్వారా ఎంకయ్విరీ చేయించింది. ఈ రోజు  సాయంత్రం నాలుగు గంటల వరకు ఆనగ స్మగ్లర్ వద్ద ఉంటుంది, దాని ఖరీదు పదహారు వందల యాభైఅయిదు  రూపాయలు.

    నా దగ్గర ప్రస్తుతం ఆఫీసు డబ్బు పన్నెండు  వేల రూపాయలుంది. ఊళ్ళో నా బ్యాంకు  బేలన్స్ రూపాయలలో అయిదంకెల స్ధానంలో ఉంది. నేను ఆమె అడిగిన మొత్తాన్ని అప్పుగానేం కర్మ-బహుమతిగానే ఇవ్వగలను__"ఇంతకు మీ  అన్నయ్యకు నాగ కొనబోతున్న  విషయం తెలుసా?" అనడిగాను.

    "తెలియదు. వాడి దగ్గర  డబ్బుంటుందని మాత్రం  తెలుసు. ఎటొచ్చీ  ఇదంతా  విని ఏమంటాడో మాత్రం  తెలియదు."

    నేను కాస్త  గర్వంగా ముఖం పెట్టి__" ఇది కోవడానికి జంకకు. మీ అన్న వద్దంటాడన్న అనుమానం ఉంటే అది  నా కానుకగా  భావించు " అన్నాను.

    ఆమె ముందు కాస్త ఆశ్చర్యపడినట్లుగా  కనబడింది. ఆ తర్వాత లేత తామర తూడుల్లాంటి తన రెండు  చేతుల్నీ  నా నడుము చట్టూ చుట్టింది.

క్"పార్వతీ- నీ  వంటి ఆడది ఊఁ అనే  అదృష్టం  పట్టాలి గానీ ఈ డబ్బు నాకో లెక్కలోది కాదు-" అనుకున్నాను.


        7

    నేను అక్కడ మొత్తం  పదహారు రోజులు గడిపాను. శ్రీధర బాబు  ఐపులేడు. పార్వతీ, నేనూ  నెనోఅ విచ్చలవిడిగా విహారాలు సలిపాం/ నాకు పార్వతి గురించి రోఖ్షం రూపేణా అయిన  ఖర్చు రెండు వేలపై  చిలుకు, కానీ  నేనందుకున్న అనుభావవుటనుభూతులు ఊహకందనివి, పార్వతి ఇలటికి వెళ్ళి పోవలసి ఉన్న కారణంగా నేను  నా ఆఫీసుకు ఎక్స్ టెన్షవ్ గురించి రాయవలసిన అవసరం కలగలేదు.

    వెళ్ళి పోయేటప్పుడు పార్వతి తన గురించి టెలిగ్రామ్ కాగితం నింపి ఆవల పారేసి__"తను లేని సమయంలో నేనిక్కడకు వచ్చి  పదహారు రోజులు గడిపి వెళ్ళిన సంగతి అన్నయ్యకు తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. "అంది.

    అదంత సులభం కాదని నాకు తెలుసు, ఆ వీధిలో ఎంతో మంది ఆమెను  చూశారు. ఆఫీసు పని మీద వచ్చిన  నాకూ ఆమెకూ గల సంబంధం ఏమిటో - ఎంత మందికి  తెలుసునో నాకుతెలీదు. ఇంటాయన లేకపోవడమూ, శ్రీధరబాబుకు పని మనిషి అంటూ ఎవరు ఉండక పోవడమూ బహుశా మా వ్యవహారాన్ని రహశ్యంగా  ఉంచడానికి కొంత  వరకు  సహకరించవచ్చు. ఎటొచ్చీ ఇంటాయన తిరిగి వచ్చేక శ్రీధరబాబు ఆయన్ను కలిసేక అసలు టెలిగ్రామ్ అనేదోకటి వచ్చిన సంగతి తెలుస్తుంది.

    మరి పార్వతి ఇంటి దగ్గర  వాళ్ళకు  ఎలాగూ  తెలుస్తుంది కదా-ఆ  అనూమానాన్ని పార్వతి వ్యక్త పరచగా  ఆమె నవ్వి__"ఆ భయం నాకు లేదు. నేను అన్నయ్య   దగ్గరకు  వెడుతున్నట్లుగా ఇంట్లో చెప్పలేదు.  నా స్నేహితురాలితో కలిసి ఎక్కడికో వెడుతన్నట్లుగా ఇంట్లోచెప్పి బయల్దేరి చెరో చోటికీ ప్రయాణమయ్యాం. న్నెఉ ముందు నా స్నేహితురాలిని కలిసేకనే  ఇంటికి వెడతాను." అంది.

    "అసాధ్యురాలివే!" అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్నో ప్రశ్నకు సమాధానాలు లభించాయి-ఒక్క పార్వతి విపరీత ప్రవర్తనకు కారణ మేమిటీ అన్న ప్రశ్నకు తప్పు.

    పార్వతి నాగ కొనాలనుకుంది. తను బయల్దేరి వస్తున్నట్లుగా అన్నకు టెలిగ్రామ్ ఇచ్చింది. అన్న లేకపోతే నా దగ్గర  డబ్బు తీసుకుని నాగ కొనుక్కుంది. ఇది అని చెప్పలేని కారణాల వల్ల నాతో కొన్ని రోజులు సంసారం చేసింది. అందుకు ప్రతిఫలం  నాదగ్గర  దనరూపేణా పొందింది. ఇప్పుడు  తిరిగి ఇంటికి వెడుతోంది. అటు అన్నకు. ఇటు  తల్లిద్రండులకు  తన రహస్యం   తెలియకుండా జాగ్రత్త పడుతోంది.

    నా ఆఫీసు పని ముగిసింది. పార్వతి వెళ్ళిపోయింది. ఆ కారణంగా నేను తిరుగు ప్రయాణం  చేయవలసి ఉంది. శ్రీధరబాబునించి మళ్ళీ  ఉత్తరం లేదు. ఆ పరిస్దితుల్లో  ఏంచేయాలో తోచక-ఇంటాయనకో రిజిస్టర్ పార్సిల్ లో శ్రీధరబాబు గది డూప్లికేట్ తాళం పంపించి ఒక ఉత్తరం కూడా రాశాను. అందులో  ఎందుకైనా మంచిదని ఒక చిన్న అబద్దం కూడా రాశాను! టెలిగ్రాం ప్రకారం-శ్రీధరబాబు చెల్లెలు రావలసి ఉన్నప్పటికీ ఏ కారణాల వల్లనో ఆమె రాలేదని.

    నేను ఇల్లు చేరిన నాలుగు రోజులకు శ్రీధరబాబునించి ఉత్తరం వచ్చింది. అనుకోకుండా ఎదురైన గృహసమస్య కారణంగా తను చిరునామాకూడా ఇవ్వకుండా  మాయమైనాడనీ' అన్యథా భావించవద్దనీ అతను రాశాడు. సేల్సు  వ్యవహారంలో అనుకోకుండా అతను తన ఊరు వెళ్ళడం సంభ వించిందట__అనుమాన పరిస్ధితులలో అతని చెల్లెలు మాయమైందట.

    నీకు తెలుసుగదా__నాకు నా చేల్లెలీకీ ఉన్న అనుబంధం, ప్రస్తుతం అన్వేషణలో ఉన్నాను. అన్వేషణ ముగిసే  వరకూ  మరేపనీ చేయలేను.  అందుకే వచ్చి ఇల్లు కాళీచేసి  వెళ్ళిపోతున్నాను. బల్లమీద నీ చిరునామ వదలి వెళ్ళినందుకు ధన్యవాదాలు. చాలాకాలం తర్వాత కలుసుకున్నందుకు సరిగ్గా  గడప లేకపోయాము. మరోసారి మంచి అవకాశం వస్తుందనీ, అది సక్రమంగా వినియోగించుకోగలమనీ ఆశిస్తున్నాను"__ అవిరాశాడతను.

     

    ఆ రోజు అరుణా హొటల్ చాలా రష్ గా ఉంది. నన్ను  బాగా తెలిసున్న సర్వర్-" అలావెళ్ళండి సార్! అక్కడ కాళీ  ఉంది-" అని దారి చూపించాడు.

    అది ఫామిలీస్ కోసం ఉద్దేశించబడిన అపార్టు మెంట్. అలాంటి అపార్ట్ మెంట్సు అక్కాడ చాలా ఉన్నాయి. ఒకో  అపార్టు మెంట్లో  నాలుగుసీట్లు  మాత్రం ఉంటాయి. సాధారణంగా బ్రహ్మచారి  యువకులు  ఒంటరిగా వాటిలోకి  వెళ్ళే  అవకాశం  రాదు. సర్వర్ చెప్పాడు కదా  అని నేను  వెళ్ళాను. అక్కడ రెండు సీట్లు కాళీగా ఉన్నాయి. ఒక  సీట్లో కూర్చన్నాక యథాలాపంగా ఎదుటిసీట్లో ఉన్న  జంటను చూశాను. ఉలిక్కి  పడ్డాను పార్వతి!

    అప్రయత్నంగా-"పార్వతీ!" అన్నాను.  ఆమెనన్ను  చూసి  ఉలిక్కిపడింది. ఆమె  ప్రక్కనున్న యువకుడు నావంక  గుర్రుగా చూశాడు.

    "ఇక్కడి కెప్పుడోచ్చావ్ పార్వతీ!" అన్నాను  నేను.

    "ఎవరు మీరు?" అనడిగాడా యువకుడు.

    "ఆమెనే అడగండి __"అన్నాను ధైర్యంగా. సర్వర్  లోపలకు వచ్చాడు. వాళ్ళూ నేను  కూడా మా అర్దర్సు చెప్పాం. సర్వర్ మంచినీళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు మరో జంట మా అపార్ట్ మెంట్లోకి తొంగిచూసి_ఒకసీటే కాళీ ఉండడం చూసి వెనక్కు వెళ్ళిపోయారు.