Facebook Twitter
ఫ్యాషను, నడక ఏం చెబుతాయి ?

ఫ్యాషను, నడక ఏం చెబుతాయి ?

- స్వప్న కంఠంనేని

మీరు ప్రేమిస్తున్న యంగ్ మేన్ ఒకసారి సోగ్గాడిగా కనిపించి, కనుముసినా తెరిచినా మీ ముందు అతడే
ప్రత్యక్షమవుతూ, మరొక రోజు మాసిన గెడ్డంతో, నలిగిన దుస్తులతో కనిపిస్తే..!  చిరాకు పడతారా ? కలవార
పడతారా ? అతణ్ణి ఎలా అర్ధం చేసుకోవాలన్న సందేహంలో పడితే.. ఇదుగో..ఈ అంశాలు ఒక్కసారి గుర్తు
చేసుకోండి. ఒకప్పుడు మగవాడు దుస్తులు పట్ల శ్రద్ద వహించి షోకిల్లా లా తయారైతే సమాజం అతణ్ణి కొంత చులకనగా చూసేది. కాని  నేడలా కాదు,రాను రాను సభ్య సమాజం ఆడవారి లాగే మగవాళ్ళు కూడా దుస్తుల పట్ల, శరీరాకృతి పట్ల శ్రద్ద వహించాలని కోరుకుంటోంది.

ఈ విషయంలో ఏ పురుషుడన్నా నిర్లక్ష్యం వహించితే అతడి ఆలోచనలను సందేహించటము  జరుగుతుంది.
దానా దీనా నేటి ఆధునిక పురుషుడు ఫ్యాషన్లకు సంబంధించి కొన్ని ఒత్తిడులకు లోనవుతున్నాడు. అయితే
శతాబ్దాల తరబడి స్త్రీ పొందిన ఒత్తిడులతో పోల్చి చుస్తే ఇదేమంత లెక్కలోనికి రాదన్నది వేరే విషయం!
ఇప్పుడు పురుషుడు ధరించే దుస్తుల ధోరణి అతడిలోని ' ప్రేమరావును ఏరకంగా బయటపెడుతుందో చూద్దాం.

అతి ట్రిమ్ గా వుండే రాకేశుడు :

ఒక యువకుడు మడత నలగని ఒక ఇస్త్రీ బట్టలతో ట్రిమ్ గా తయారవుతాడు. బయటికి రాబోయే ముందు
సెంటు స్ప్రే చేసుకుంటాడు. ఒకటికి నాలుగు సార్లు అద్దంలో చూసుకుని ఆడదానికంటే మిన్నగా టక్నీ,మడతల్ని  సరిచేసుకుంటాడు. బయటకి వచ్చి తనకోసం ఎదురు చూస్తున్న స్నేహితురాల్ని ' హాయ్' అంటూ గ్రీట్ చేస్తాడు.
* ఇతనేలాంటి ప్రేమికుడు కావచ్చు ?
తనెలా కనిపిస్తూన్నడనే అంశం కోసం డబ్బుని,శ్రమని,సమయాన్ని,వెచ్చించ గలిగే పురుషుడు తను ప్రేమించే
స్త్రీ కోసం కూడా ఈ మూడింటిని ఖర్చు చేయగలుగుతాడు. నీట్ నెస్ కోసం,తీర్చిదిద్దటం కోసం, అతనినిచ్చే ప్రాముఖ్యత మాట నిలబెట్టుకునే విషయంలో కూడా అతను అంతరాత్మ బద్దుడై ఉంటాడనే విషయాన్నీ తెలుపుతుంది.అయితే ఒకటి ,స్వయం సౌందర్యం కోసం అతను పడే అతి తాపత్రయం అతనికి సంబందించిన రెండు నెగిటివ్ విషయాలను కూడా తెలుపుతుంది.
అతను ఇతరులతో సంబంధాల విషయంలో కూల్ గా యధాలాపంగా ఉండవచ్చు. ఫర్ఫెక్షన్ (పరిపూర్ణత) కోసం
పడే అతి తాపత్రయం అతనికి తనమీద తనకున్న తక్కువ అభిప్రాయాన్ని , స్వయం విమర్శనా తత్వాన్ని
తెలియజేస్తుంది.స్వయంసౌందర్య స్పృహ లో కొట్టుమిట్టాడే మనిషి తను ప్రేమించే అమ్మాయి విషయం లో కూడా అదే రకపు నీట్నెస్ ని ఆశిస్తాడు. ఆ విషయంలో ఆమె ఏన్నడన్నా ఏ కారణం చేతనైన బద్దకించితే ఆమెకు తన పట్ల  ప్రేమ తగ్గింది గావునని అనుకునే అవకాశం ఉంది. అంతే కాదు  ఆమె నుంచి ఎడంగా జరిగే ప్రమాదము ఉంది.

ఫ్యాషన్స్ ని పట్టించుకోనివాడు :


ఇతనేలాంటి ప్రేమికుడు మహాశయా ?

ఇతనిది కొంచం టీనేజ్ మనస్తత్వం ! మూడీగా ఉండే విప్లవాత్మక తత్త్వం. బుద్దిపుట్టినప్పుడు తన పక్కన ఉన్న
అమ్మాయిని నవ్వులు కేరింతలతో  ఆకాశ వీధిలో విహరింప జేస్తాడు. తిక్క పుట్టిందంటే ఆమెనసలు లెక్క
జేయడు. ఆ అమ్మాయి అతగాడిని మార్చాలని ప్రయత్నించినా అతడి నుంచి ఏదన్నా కోర్కెను కోరినా
ఇష్టంలేకపోతే టీనేజ్ కుర్రవాడిలా తీవ్ర చూపుల్తో  తిరస్కరిస్తాడు.
 
 నిర్లక్ష్య నిరంజనుడు :

మరో రకం యువకుడు ఉంటాడు. తను ప్రేమించే అమ్మాయితో షికార్లు కొడుతున్నప్పుడు ఒకసారి సన్నటి
గడ్డంతో, పెళపెళలాడే అందాల దుస్తులతో సొగసు పురుషుడిలా కనిపిస్తే మరోసారి సరిగ్గా గడ్డం చేసుకోకుండా
నలిగిన దుస్తులతో అప్పుడే నిద్ర లేచిన వాడిలా బద్ధకంగా బయల్దేరవచ్చు.
ఇతడి గురించి అమ్మాయి ఏమనుకోవాలి? ఇతను కొంచెం స్వార్ధచిత్తుడు, ఎంత సేపూ అతనికి తన ఉద్వేగాలు, తన ఫీలింగ్స్ ముఖ్యమైనవిగా కనిపిస్తాయి గాని ఎదుటివాళ్ళ ఉద్వేగాల్ని పట్టించుకోడు.
అతడిని ప్రేమించే అమ్మాయి అతడు కోరుకునే ప్రేమను, ఆదర్శాన్ని అతడికి అందిస్తే ఆమె పట్ల నిజాయితిగా
ప్రేమగా ఉంటాడు. అలాకాక ఆమె నువ్వు ఫలానా సమయంలో గడ్డం చేసుకోలేదు. నీ పక్కన రావటానికి నాకు సిగ్గేసింది" లాంటి సనుగల్లు ప్రారంభించిందంటే నువ్వెంత, నీ కతెంత, పో! అనే ధోరణిలో ఆమెను లెక్కచేయడు
ఆడపిల్లకు అతనితో వ్యవహారం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఉంగరాల గింగరాలవాడు :
కొందరు యువకులు ఉంటారు, మేడలో సన్నటి గొలుసు వేలాడుతుంటుంది. ( దానిని కాలరు బయటకి
వెలాడవేసి నలుగురికి కనిపింజేయాలని చూస్తారు) అలాగే చేతికి ఉంగరం ఉంటుంది. తరచుగా దానిని వెలి
మీద ఆటు ఇటూ తిప్పుతుంటారు. నన్ను చూడు నా నగలు చూడు, నా దర్పం చూడు అన్నట్టుగా మనల్ని
తమ ఆభరణాలతో ఆకట్టుకోవాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రేమికులు మహాత్య?
ఇతని బుద్ధికి డబ్బు అత్యంత ప్రధన్యమైనదని అర్ధం చేసుకోవాలి. ఆ విషయాన్నీ దాచుకోవటానికి కూడా పెద్దగా  ప్రయత్నించడు. చాలా సూటి ప్రేమికుడితను. ఇదిగో నేను డబ్బుల్ని ప్రేమిస్తాను. నా డబ్బు డాబూ ఇదీ! మరి నీ మాటేమిటి? అనే ధోరణి ప్రియురాలి వద్ద కూడా ఉంటుంది.
ఏమంత ఎమోషనల్ గా ఉండడితను. మరో డబ్బున్న అమ్మాయి కనిపిస్తే చాలా కాజువల్ గా అంతకు
మునుపటి ప్రియురాల్ని వదిలేసి ఆమె వైపు మొగ్గగలడు. ఇతడికి డబ్బు జబ్బుగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లకు కూడా అదే రకమైన జబ్బుంటే ఆమె అతనివైపు మొగ్గవచ్చు. అతడి నుంచి ఆమెకు డబ్బు లభించవచ్చేమో గాని ప్రేమ విషయం మాత్రం సందేహమే!

పైకి ప్రేమ కనిపించినా కూడా అది డబ్బుతో ముడివేసుకొని ఉండే ప్రేమే అవుతుంది.....