Facebook Twitter
నాటి చిగురు స్పర్శ

నాటి చిగురు స్పర్శ
తీపి  తలపయింది
కట్టె అయి
ఇంటి తలుపయింది

నీడ పడితే
నిశ్చలంగానే ఉంది
నేనే దిగితే
చెదిరిపోయింది చెరువు.

కొవ్వొత్తి
కన్నీరు కారుస్తోంది
హృదయం కరగడమంటే
ఇదే.