Facebook Twitter
స్నేహమా విడిపోకు నన్ను

స్నేహమా విడిపోకు నన్ను

శ్రీమతి శారద అశోకవర్ధన్

స్నేహమా విడిపోకు నన్ను

నీవు లేకుంటే లేనేలేను నేను.

మనిషికి మనిషికి మధ్య

మమతలకు ఆలంబనం నీవు

ప్రేమకు మూలం నీవు

సృష్టికి కారణం నీవు

నీవు లేకుంటే జగతియే లేదు

నీవు లేకుంటే లేనేలేను నేను.

గొప్ప బీదల తారతమ్యం లేదు

నీకు అంతస్థుల ప్రమేయం అసలే లేదు

అందుకు నిదర్శనం కుచేలోపాఖ్యానం.

అదొక్కటేనా! స్నేహంకోసం ప్రాణాలొడ్డిన కధలెన్నో

! ఆ గాథలెన్నో! స్నేహమా!

నీవు త్యాగశీలివి దయామయివి

కరుణా ప్రపూర్ణవి.

స్వార్ధపు వలయాలు సుళ్ళు తిరుగుతూన్న

ఈ రోజుల్లో మంచికి స్థానం ఇవ్వలేరు,

ప్రజలు నిన్ను గౌరవించలేరు.

నాకు తెలుసు నీ గుణం మరువలేను ఒక్క క్షణం.

నీ పేరిట జరుగుతూన్న ఘోరాలు

నా ప్రాణాలు తీస్తూన్న ఆయుధాలు.

నీ నీడన జరిగే అక్రమాలు యమలోకానికి సోపానాలు.

అన్యాయం పెరిగిపోతూన్న ఈనాడు

అధర్మం రెచ్చిపోతూన్న ఈరోజు.

చావ లేక నిలువ లేక నలిగావు నీవు.

మిగిలాను నేను. అయినా నామాట నమ్ము

ఇది అక్షరాలా నిజము. నీవు లేకుంటే లేనేలేను

నేను ఓ స్నేహమా! విడిపోకు నన్ను.