Facebook Twitter
చివరిమాట - సి. రామ్మోహన్

చివరిమాట

 

సి. రామ్మోహన్

 

 

నీకు ఎన్నో చెప్పిన నేను చెప్పకుండావెళ్తున్నా

ఈ నిస్సహాయ క్షణంలో నేను కోరేది ఒక్కటే,

"నేనేమైనా కానీ, నన్ను మృతి చెందని స్మృతిగామిగుల్చుకో,

ఒక గాలి అల నిన్ను తాకినప్పుడు, రాలిపోయిన

పువ్వు నీకంట పడినప్పుడు నీకు తెలియకుండా

నేను గుర్తుకొస్తే ఆ చిన్న జ్ఞాపకాన్ని

ఓపిగ్గా దాచుకో క్షణకాలమైన చాలు

శాశిత్వంగా సంతృప్తి పడతాను."

ఉంటాను నేస్తం -

"మిగిలితే మళ్ళీ కలుస్తాను..."