వినవయ్య మానవ..!!
మనసు విప్పి..కళ్ళు తెరిచి..విను..విను..!!
అరువు తెచ్చి దున్నెను..!!
కరువు వచ్చి కాటేయును..!!
రుణం తెచ్చి పోలంలో రణం చేసి..!!
క్షణ క్షణం దిగుబడికై ఎదురుచూస్తే..!!
దింపెడు కల్లం ఆశలే అయిపొతున్నాయి..!!
మరణాలే శరణాలు అవుతున్నాయి..!!
ఆంధ్ర రైతు వడ్డి పెరిగే..!!
తెలంగాణ రైతు నడ్డి విరిగే..!!
ప్రపంచానికి పొట్ట నింపే రైతుకు..!!
పావు గంట కూడా ఉండదు కరెంటు..!!
రుణం చెల్లించకుంటే రైతుకు తప్పదు వారెంటు..!!
దేశాన్ని దోచుకోని పరదేశంలో..!!
నివశించే వారిని ఏమి చేయలేవు ఈ ప్రభుత్వాలు..!!
దేశంలో ఉన్న ప్రజల పొట్ట నింపుటకై..!!
చేసిన రుణాలు చెల్లించమంటే గగ్గొలు పెడతాయి..!!
వినవయ్య ఓ మానవ ..!!
రాబోయే రోజులు బువ్వ దొరకక..!!
ఒకరికి ఒకరం పీక్కు తింటాము..!!
ఇప్పటికే కొన్ని దేశలలో మోదలైయినది..!!
అయినా మారకపోతే నీ దేశ పరిస్థితి..!!
నీ పరిస్థితి కూడా అంతే..!!
---జాని.తక్కెడశిల
