Facebook Twitter
చినుకు

 

చినుకు

పదా!నేలన రాలే ముత్యాలను ఒడిసిపట్టి
నువ్వు నా మీద నేను నీ మీద చిలకరించుకొని
కాసేపు పరవశిద్దాం

మేఘాలన్నీ ఆనంద భాష్పాలైపోతున్నపుడు
నువ్వూ నేనూ నవ్వులై మురిసిపోవటానికి ముందు
మట్టిగీతం ఒకటి వినిపించిందా?
మిన్నునైనా లాలిస్తే.. మన్ను ఒడిలో పాపైపోదూ!

కప్పు కాఫీ ముద్దుల్లో కరిగిపోతున్నపుడుman
లీలగా బీథోవెన్ సింఫనీ ..
మనసు గదులను కట్టిపడేస్తున్నపుడు
కళ్ళల్లో మెరిసిన మెరుపు
మరి ఆ ఆర్ధ్రత మేనుదో.. మిన్నుదో!
రెండూ ఒకేలా మురిసిపోతూ ఉంటే
కళ్ళెదుట మెదిలిన నీ రూపానికి
మళ్ళీ మనసు మోహనరాగంలో పడి మునకలేస్తూ
అనకుండా ఉండగలదా
పెన్నాళ్ళ వెన్నాయి నాన్ నీతాన్ మీట్టూ
ఎన్నేన రాగన్గళ్ నీతాన్ కాట్టూ
( ఈ వీణ మీటేది నీవేనంటా .. నా తలపు..నా వలపు నీదేనంటా)

 

-సరిత భూపతి