Facebook Twitter
ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో

ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో

 

 

ఉత్తర ప్రత్యుత్తరాల కాలం పోయిందేనాడో!!
ఎప్పుడయినా పాత పుస్తకాలు
తిరగేస్తున్నప్పుడు పేజీల మధ్యన
దాచిన ఉత్తరం కంటపడితే
అదో అబ్బురం.. అలా ఓసారి తడిమి
చదివిందే అయినా మరో మారు చదివి
జాగ్రత్తగా దాచుకుంటాం!!

ఎంతయినా ఒకప్పుడు
దూరాలను కరిగించి
అనుబంధాలను దగ్గర చేసినవి
ఈ ఉత్తరాలే..
కుశల మడిగిన కార్డులా
గుంభనపు ఇన్ లాండ్ కవరులా
తరువాత వచ్చి చేరిన పలకరింతలు
పులకరింపులయ్యేలా గ్రీటింగ్ కార్డులు..

మనసుదోచిన జవరాలికో ప్రణయ లేఖ
మానస వీరునికి ప్రేమ లేఖ
మనసెరిగిన మారాణికి మానస లేఖ
దూరతీరాల కొలువు తీరిన మారాజుకి
సుఖదుఃఖ్ఖాల పరామర్శ లేఖ
కన్నవారిని కుశలమడిగే లేఖ
వీడిన నేస్తాల పలకింపుల లేఖ
కొత్తగా పరిచయమైన కలంస్నేహంతో
పరిచయ లేఖ
పెండ్లికి శుభ లేఖతో
చావుకి కార్డుతో ..
ఎన్నెన్ని కబుర్లో లేఖల లోకంలో
లోకాలే మరచి మునిగి చదివిన గురుతులెన్నో
వైభవం ఆనాడు
కనుమరుగైపోయె నేడు...- సంధ్యాతులసి

 

 

- సంధ్యా తులసి