Facebook Twitter
" ఏడు రోజులు " పార్ట్ -3

 

" ఏడు రోజులు " పార్ట్ -3

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

"వేలెడు లేదు కుర్రకుంక వీడికి సమాజం సంస్కరణ కావల్సోచ్చింది" వెళ్తున్న కొడుకును చూస్తూ భార్యతో అన్నాడు గోపాలయ్య.
 బయటికి వచ్చేశాడు భావానీశంకర్. అతడి మనసులో ఇప్పుడు మునుపటికంటే రెండింతలు ఎక్కువ భయపడుతున్నాడు.
 "డబ్బు తీసుకుని తను ఇంట్లోచి వెళ్ళిపోవడంవల్ల తన పప్పాకి ఇబ్బందులు ఎదురౌతాయని మాత్రమే ఇదివరకు బాధపడ్డాడు ఎందుకంటే తను గౌసియాతో కలిసి వెళ్ళిపోయినట్లు ఇంట్లో తెలియకుండా, కేవలం డబ్బు తీసుకుని ఎటో పారిపోయినట్లు మాత్రమే తెలియాలనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా గౌసియా గురించి ఇంట్లోమాట్లాడాడు. రేపు ఇంట్లోంచి వెళ్ళి పోతే విషయం ఇంట్లోవాళ్ళకి కచ్చితంగా తెల్సుకాబట్టి, నిజం ఎలాగైనా బయటికి పొక్కి హిందూముస్లిం గొడవలు జరుగుతాయేమో?  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలాంటి సమస్యలు వుండవనీ, గౌసియా గురించి ఇంట్లో చెప్పగలిగాడు. మరి, తను తెలిసీ తెలియక చేసిన ఈ పొరపాటు నిజంగానే తలలు తెగేవరకు దారి తీస్తుందేమో"
 నిలువెల్లా వణికిపోతున్నాడు భవానీశంకర్.
  అప్పటికి చీకటిపడింది సమీపంగా వున్న హనుమాన్ మందిరం దగ్గర భజన కార్యక్రమం ఆనవాయితీగా మొదల మొదలయ్యి౦ది.
 "అమ్మ నేను భజనకు వెళ్తున్నాను" బయటనుండేచెప్పి మందిరంవైపు నడిచాడు భవానీశంకరం.
 "రామా మేలుకోనరా... శ్రీరామ మమ్మేలుకోనరా"  మైకు ముందు కూర్చుని భజనకీర్తన పడుతున్నాడు బలస్యామి.  అతడు కొంత పాడగానే మిగతావాళ్ళు ఆ రాగాన్ని అందుకుంటున్నారు.  వెళ్ళి అందరి మధ్యనా కూర్చున్నాడు భవానీశంకర్.
 కొంచం దూరంగా కనిపిస్తున్న మసీదుతాలుకు ప్రహరిగోడ పక్కన  చాయ్  బండి అమ్ముతూ కనిపిస్తున్నాడు సాయిబు. అతడి బండిచుట్టూ గిరకీజనాలు నిండుగా వున్నారు.
 తానే చాయ్ కాయడం, తానే గ్లాస్ కడుక్కోవడం వంటి అన్నిపనుల్ని తానే చూసుకుంటూ ఇప్పుడు తీరికలేకుండా కనిపించే సాయిబు...  ఆ  సమయంలో చాయ్ మాత్రమే అమ్ముతూ కనిపిస్తున్నాడు. ఎవరో దాదాపు పది సంవత్సరాల పిల్లవాడు పక్కనే ఎంగిలి గ్లాసులు కడుగుతున్నాడు. భజనమధ్యలో లేచి సాయిబువైపు నడిచాడు భవానీశంకర్. అతడు చాయ్ బండికి సమీపంగా వెళ్ళగానే, "చాయ్ హోనా" అడిగాడు సాయిబు.
 "వద్దు...  వక్కపొడి పాకెట్టు ఇవ్వు" అంటూ చొక్కాజేబులోంచి రూపాయిబిళ్ళ తిసి డబుల్ రొట్టెల డబ్బామీద వుంచాడు భవానీశంకర్.
   బండిలో ఒకపక్కగా వేలాడదీసిన వక్కపొడి పకేట్లలో ఒక పకేట్టును చింపి భవానీశంకర్ కి  అందించి, రూపాయిబిళ్ళ తీసుకుని గళ్ళలో వేసుకున్నాడు సాయిబు
 "ఈ అబ్బాయి ఎవరు సాయిబు? "పాకెట్టును చింపి వక్కపొడి నోట్లో పోసుకుని నములుతూ అడిగాడు భవానీశంకర్.
 "పురా గరీబు బచ్చా! సహాయంచేద్దామని పనిలో పెట్టుకుమ్నాడు" చెప్పి, "అరే పాషా! జెల్దీ కమ్ కరో'' గ్లాసులు కడుగుతున్న కుర్రాడిని ఆదేశించాడు సాయిబు.
 అంతలోనే  ఓ ఇద్దరు గిరాకీలు వచ్చారు.  వస్తూనే "సాయిబు వన్ బైటు చాయ్ చెప్పాడు ఒక వ్యక్తి.
 "టికే, టీకే అంటూ చిన్నగా వెలుగుతున్న బర్నాల్ స్టౌ మీద వున్న చాయ్ గిన్నెలో మరికొంచం  టీ పొడి, పంచదార, పాలు కలిపాడు సాయిబు. ఆ  తర్వాత మంటను పెద్దది చేసే ప్రయత్నంగా గాలికోట్టడం ఆరంభించాడు.
 భవానీశంకర్ కొన్నిక్షణాలు సాయిబు వైపు అశ్యర్యంగా చూసి, తర్వాత హనుమాన్ మదిరంవైపు నెమ్మదిగా నడిచాడు.
 రోజూ రెండుకిలోల బియ్యం కొనుక్కొని అతిభారంగా జీవితాన్ని నడిపే  సాయిబు లో ఇప్పుడు కొత్త ఉత్సాహం. ఇన్నిరోజుల వరకు 'పనిపిల్లడు ఎందుకు? పైసలు దండుగ' అనుకున్నవడల్లా, ఇప్పుడు పనిపిల్లడ్ని పెట్టుకోవడం... తోడుగా 'గరీబుబచ్చా' అని జాలిచూపడం చేస్తున్నాడు సాయిబులో అంతమార్పు ఎందుకు వచ్చిందోవ భవానీశంకర్ గ్రహించగలిగాడు. అందుకే అతనిపై కోపం వచింది.
 "కన్నకుతుర్ని అంగడి సరుకు చేయాలనుకుంటున్న పాపిష్టి వెధ"  తనకి మాత్రమే వినిపించేలా తిట్టుకుంటూ మందిరం దగ్గరకి వెళ్ళి ఎప్పట్లా అందరిమధ్యనా కుర్చుంన్నాడు .
  బాలాస్వామి పాడుతున్న కీర్తన పూర్తయ్యింది. మరోపాట అందుకుంటాడని అనుకుంన్నాడు  భవానీశంకర్. కానీ అతడు తనని దోషిలా చూడ్డంతో కలవరపడ్డాడు అతడు ఎందుకు అలా చుస్తుంన్నాడో కూడా భవానీశంకర్ కు తెలుసు.
  "ఆ  తుర్కోడు బండిదగ్గరకు ఎందుకు వెళ్ళవు? " నిలదీసిన్నట్టుగా అడిగాడు బాలాస్వామి.
  "వక్కపొడికోసం " చెప్పాడు భవానీశంకర్.
 "ఇకనుండి  ఆ  సుబ్బిశెట్టి దుకాణంలో కనుక్కో " చెప్పి "రామా  శ్రీ రామా జయ రామా...  మాకు మతంలేదు... కులంలేదు... వున్నది  నువ్వొక్కడివే" అంటూ మరో కీర్తన అందుకున్నాడు బాలాస్వామి భకిపారవశ్యంతో కీర్తన పాడుతూనే తనపై ఆగ్రహించిన బాలాస్వామి తీరు భవానీశంకర్ కి  విస్మయాన్ని కలిగించింది. తోడుగా ప్రస్తుతం అతడు పాడుతున్న కీర్తన నవ్వును తెప్పించింది. అయినా మౌనంగా కూర్చుండిపోయాడు.
  హిందూముస్లిం  తేడాలు బాలాస్వామి, సాయిబుల కారణంగా  ఆ  ప్రాంతములో బలంగా వున్నాయి. అలాగని శతృవుల్లా ఎవ్వరూ మెలగారు. ఎవరికివారే అన్నట్టుగా వుంటూనే,. అవసరం అయితే ఆడపాదడపా కొందరు మాట్లాడుకుంటారు.
  అయితే  ఆ  'ఇద్దరు' లో సాయిబు మాత్రం వ్యాపారరీత్య తరచు అందరితో మాట్లాడుతుంటాడు. కానీ  లోలోపల మనసు చంపుకుంటాడు.  
  నిజానికి  ఆ  ప్రాంతానికి చెందినవాళ్ళు సాయిబు దగ్గరికి వెళ్ళడం బహు అరుదు మసీదులో తాయెత్తులు కట్టే మిన్సిపు ఒకాయన  వున్నాడు.  ఆయన దగ్గరికి వేరే ప్రాంతానికి చెందిన జనాలు మతప్రమేయం లేకుండా వస్తుంటారు. అలాంటివాళ్ళ గిరాకీ సాయిబుకి ఎక్కువ.
  అదేపనిగా వస్తుండే  ఆ  జనాలు కోసమే తన దగ్గర నిమ్మకాయల్ని, అగర్ బత్తీలని, ఊదును ఉంచుకుని బయటికంటే ఎక్కువ అమ్ముతుంటాడు.
  బాలాస్వామి మాత్రం ముస్లింలతో అస్సలు మాట్లాడడు.  మాట్లాడిన భవానీ శంకర్  లాంటి వాళ్లను అధికారికంగా నిలదీస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ముస్లీం పండుగల సమయాల్లో ప్రత్యేకంగా భజనసమయాన్ని పెంచుతుంటాడు. అవసరమైతే ఆ సమయాల్లో రేయింబవాళ్ళు భక్తి గీతాలతో గుడితాలూకు  మైకును ఆదరగొడుతుంటారు.  
  అందుకే  బాలాస్వామి చూస్తున్న భవానీశంకర్ కి  కోపం వచ్చింది. 'మంచి మనసు' ఉండాలేగాని, ఏ మతమైతే ఏముంది? ' మనసులోనే అనుకున్నాడు.
  అతడి మనసును హర్షిస్తున్నట్లుగా అప్పుడే గుడిగంటలు మోగాయి. ఎవరన్నట్లుగా చూశాడు భవానీ శంకర్.
  తన పప్పా! అప్పుడే మందిరంలోకి వచ్చి భజనకు కూర్చోబోతూ హనుమంతుడికి దణ్ణం పెట్టుకున్నాడు.

------ ఇంకా వుంది ------