Facebook Twitter
జెర్నీ (కవిత)

జెర్నీ

 

 

భారంగా పరిగెడుతున్న చిక్కటి అలలా
ఆశలు అనంత దూరాలు పయనిస్తున్నపుడు
అది అలుపెరుగని నిరంతర ప్రవాహమని తెలిసి
ఏ తీరం చేరని కలల భారాన్ని మోస్తున్న హాయి

నేను నా చుట్టు ఎప్పటికప్పుడూ
పెనవేసుకుంటున్న ఓ స్వేచ్ఛను
మౌనాల్ని నిర్భయంగా వింటున్న కాళరాత్రిలో
దూరంగా కీచురాయి శబ్ధం ఆ నిశ్శబ్ధాన్ని ఏం చేయగలదు?

మరో మౌనాన్ని గంభీరంగా కోరుకోవటం తప్ప..

నా ఆశలు అలల్లా నిరంతరం కెరటాలైపోతున్నపుడు మరో తీరమెపుడూ
స్వేచ్ఛావిహంగమై రమ్మంటూ
ఎదురుచూస్తూనే ఉంటుంది
దాని కల నిజమవకపోయినా నా పయనం ఆగదు
నేనో అలుపెరుగని బాటసారి

- సరిత భూపతి