Facebook Twitter
నాకు నేనే (కవిత)

నాకు నేనే

 

 

కాలాలు ఋతువులూ
పగళ్లు రాత్రులు
బాధలు కన్నీళ్ళు
ఆనందాలు నవ్వులు
మాట మౌనం
అన్నింటా నేనే
నాతో నేనే ,....నాలో నేనే
.
.
ప్రశ్నలూ జవాబులు
గెలుపు,... ఓటమి
ఓదార్పుని ..లక్ష్యాన్ని
ఎన్ని జరిగినా
నాలోని నాతోనే
అవునన్నా నేనే...కాదన్నా నేనే
.
.
కలత చెందిన మనసును
ఊరడించే స్పర్శని
ఓర్వలేని క్రోధాన్ని
మమతలురే మనసుని
నా ఉనికికి సాక్ష్యాన్ని
నాలో నాకోసం
నాకు నేను తప్ప
నాకోసం నేను కాక
నాకంటే పరితపించేవారెవ్వరని
నేను కాకా ఇంకెవరని!!

 

 

 

 

- రఘు ఆళ్ల