ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి, లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి.
May 31, 2024
అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.
May 28, 2024
ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా తన వంతు సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రాగమానికీ ఏటిగట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.
May 24, 2024
శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు....
May 20, 2024
కురు పాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా అందంగా అలంకరించారు. రాజవీధిలో ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలూ, అక్షింతలూ, పూలూ చల్లారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మతనయుడు రాజమందిర ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఏనుగు మొగసాలలో రథం దిగాడు.
May 10, 2024
కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి.
May 7, 2024
ప్రతివారూ వివేకవంతులే, అవివేకులు ఈ ప్రపంచంలో వుండడు. ఈ వివేకవంతులూ మూడు రకాలుగా వుంటారు. ప్రథములకు అసలు ప్రశ్నయే పుట్టదు, ద్వితీయులకు ప్రశ్న కలుగుతుంది, కానీ సమాధానం స్ఫురించదు, ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుందనేవారు విశ్వనాథసత్యనారాయణ గారు.
May 4, 2024
కాకడ దేశాన్నేలే కృష్ణ భూపతి పట్టపు రాణి జ్యోత్స్నాదేవి. రాజ దంపతులిరువురూ రాజోచిత విద్యల్లో దాదాపు సమ ఉజ్జీలుగా ఉండేవారు. భానుదేశాధీశుడి ఏకైక కుమార్తె అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటి అని విన్న కృష్ణభూపతి, ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు.
May 2, 2024
ప్రాణం మీదికి వచ్చిన విద్య (చందమామ కథ)
క గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు. వాడు వాటిని రోజూ మేతకు తీసుకుపోయి, ఏ చెట్టు మీదనో, గుట్టమీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు.
May 1, 2024
సిరా చుక్కలతో కలిపి అగ్గి రాజేసిన యుగకర్త శ్రీశ్రీ
రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది.
Apr 30, 2024
విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ. ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది .
Apr 28, 2024
కన్నావరంలోని చింతామణి రోగనిర్ధారణకూ, చికిత్సకూ, హస్తవాసికీ పేరుగాంచిన వైద్యుడు. అయితే, యేటా వేసవిలో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు.
Apr 27, 2024
రామనాధం గొప్ప ధనవంతుడు. ఆయనకు చుట్టుప్రక్కల పట్టణాల్లో కర్మాగారాలు, వ్యాపారాలున్నాయి. వాటి నుండి మంచి లాభాలను గడిస్తున్నాడు.
Apr 25, 2024
వందకు ఒకటి తక్కువ! (చందమామ కథ)




















