కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు. దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.
Sep 4, 2024
పార్వతీపురంలో, మా ఇంటి ఎదురుగా రచయిత పంతులజోగారావుగారు ఉండేవారు. ఆనాటికే ఆయన పేరున్న రచయిత. నేనింకా రచనలో ఓనమాలు ఇసుకలో దిద్దుతున్న రోజులవి. ఒకనాడు ఆయన్ని పరిచయంచేసుకుని, కొత్తగా నేను రాసిన కవిత ఒకటి వినిపించాను. విని, నవ్వారాయన. ‘‘ఏదైనా వ్రాయడానికి ముందు చదవడం అలవాటుచేసుకుంటే బాగుంటుంది. నువ్వేం చదివావు?’’ అడిగారు. ఏమీ చదవలేదన్నాను.
Aug 31, 2024
పలుకుబడులు నుడికారాలకు పుట్టిల్లు తెలుగు భాష





















