ఉగాది
ఉగాది
వీడ్కోలంటోంది శార్వరీ
విపత్తులనామ సంవత్సరంగా
చరిత్రలో స్థానాన్ని సంపాదించి..
ఉప్పెనలాంటి కష్టమొస్తే
ఎదిరించడమెలాగో..
ఒంటరిగా జీవిచడంలోని
వేదనను సాంప్రదాయాల
గొప్పతనాన్ని చూపించి వెళుతోంది..
అనుభవాలలో మరిన్ని పాఠాలు
కాసుల రాశులతో సైతం కదలని
కష్టాలెన్నో ఉంటాయని
జీవన గతులను
అందరికీ పరిచయం చేసేసి..
భవితను శుభాలతో ప్రారంభించగా
వస్తోంది ప్లవనామ సంవత్సరం
గతపు విషాదాలను మరిపించగా..
నేర్చుకున్న పాఠాలను ఆచరించి
చూపించి భవితకు ఆదర్శమవమంటూ
షడ్రుచుల సమ్మేళితమైన
ఖేదమోదాలను అంగీకరించమంటూ
జీవితాన్ని మరో ఉగాది కోయిలపాటలా..తీయగా
పచ్చని తోరణాల సద్భావనలతో
ప్రారంభించి కొనసాగమంటూ..
ప్రకృతికి ప్రణమిల్లుతూ అడుగేయమంటోంది...
స్వచ్చంగా స్వాగతిద్దాం...
స్నేహబంధాలను పెనవేసుకుంటూ..!!
- అనుశ్రీ గౌరోజు
