Facebook Twitter
తెలుగు భూమి - గేయం

తెలుగు భూమి - గేయం 

 

1.  చూడంగ వలె తెలుగు వాని - చూచి
     తీరంగవలె తెలుగు భూమి
     ఆ పంచకట్టేటి తీరు - ఓహో
     పై పంచ వేసేటి జోరు
     మొగమున మీసాలకోరు
     ఎంతెంత పనినైన సాధించుతీరు || చూ ||

2. చూడంగవలె తెలుగు భామ - భళిరా!
     ధీర శూరర చూడలేమ
     కాకతీ రుద్రమ్మ, పలనాటి నాగమ్మ
     రామాయణపు మొల్ల లెందరోగాయనులు || చూ ||

౩. ఎతైన తెలుగమ్మ ఎడద - అందులో 
     ఎన్నెన్నొ భాద్యతల బెడద
     తలలోన తంగేటి పులు 
     పాండవుల పాటతో పనిలోకి వాలు  || చూ ||

4. చూడంగవలె తెలుగు భూమి - చూచి 
     తీరంగవలె తెలుగు భూమి 
     బంగారములు పండు పైరు - జీవ 
     నదులుగ పరుగులిడు నీరు
     నల్లగ ఎతైన గిరులు - తెల్లగ
     వాటిపై సర్వేశు గుడులు || చూ ||

5. అన్న చెల్లలు వరుసలోనో 
     తల్లిదండ్రుల వరుసలోనో
     పల్లెలో నివసించు ప్రజలు 
     అన్నిరంగాలలో ఆత్మబంధువులు || చూ ||

 

రచన : నందివాడ కనక దుర్గాప్రసాదరావు