గురువే దైవం

తెలియని లోకంలో
పయనించే మనిషికి దారిచూపే చుక్కాని
బాల్యపు అడుగులకు
అందమైన అమ్మపలుకులు
అందించి ఆనందం నింపుతాడు
నీతికథలతో నియమాలను
ఆటపాటలతో ఆరోగ్యం
ఎదుగులకు ఊతమవుతాడు
సుతిమెత్తగా దండిస్తూ
తప్పొప్పులను తెలుపుతాడు
మంచే విజయమని మదిలో నిలుపుతాడు
భయాలను బాధలను
స్నేహితుడై తరుముతాడు
భవిష్యత్తు నిర్మతై నిలుస్తాడు
విశ్వజ్ఞానమందించి
విశ్వసనీయత పెంచుతాడు
విజయంలో ధైర్యమై నిలబడతడు
ఓపికతో నేర్పుగా సందేహాలను తీర్చి
విద్యార్థుల మదిలో శాశ్వతమై
మిగులుతాడు
విద్యార్థులు విజయంతో
తానానందం పొందుతాడు
శభాష్ అంటూ వెన్నుతట్టే ప్రోత్సాహం
ఎప్పుడో తన విద్యార్థి
సంస్కారంతో నమస్కరిస్తే
కులాసాలతో పొంగిపోతాడు
తన విద్యార్థి భవిష్యత్తులో
స్థిరపడి తారసపడితే
హిమాలయమదిరోహించిన వీరుడైన సంబరం
ఎందరికో భవితనిచ్చి
బతుకులలో వెలుగుపంచే
గురువుకెపుడు మనసారా వందనం

సి. శేఖర్(సియస్సార్)



