TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నిన్న సాయంత్రం చివరి పిరియడ్లో...
ఆరో తరగతి అమ్మాయి
ఓ కాగితం చూపించింది
నేనే వేసాను ఎలా ఉంది మేడం అంటూ....
నోట్స్ రాయకుండా...
బొమ్మ లేస్తున్నావా అంటూనే
వేసిన చిత్రాన్ని చూసి
మెచ్చుకోలుగా తలూపి
చిత్రం తో కాసేపు మౌనంగా మాట్లాడాను
ఇంటికెళ్ళాక... ఆ రాత్రి
రాసిన కవితల్లోంచి కొన్నింటిని
ఉండచుట్టి పారేశాక...
హాయిగా నిద్ర పోయాను
తెల్లారేక నేను
మాట్లాడే కవిత్వాన్ని
రాయడం మొదలెడతాను
- చెళ్ళపిళ్ళ శ్యామల