తెలుగువన్-అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కవితల పోటీలో కన్సొలేషన్ బహుమతి రూ. 516 గెలుపొందిన కవిత

దేశ సరిహద్దులను కాపాడే సైనికుడు కాదు
దేహసరిహద్దులను కాపాడుకునే సైనికుడు కావాలి
మారణాయుధాలు చేత పట్టే సైనికుడు కాదు
మారణాయుధాన్ని తరిమికొట్టే సైనికుడు కావాలి
మందీ మార్బలం లేకుండా
ఒంటరిపోరుచేసే సైనికుడు కావాలి
ఎడారులలో, మంచుకొండల్లో నక్కక్కర్లేదు
ఆత్మీయుల ఎడబాటుతో బ్రతకక్కరలేదు
అనుబంధాల లోగిలిలో హాయిగా బ్రతకొచ్చు
నీ ఎదురుగా ఉన్నది వేల ప్రత్యర్థులు కాదు
ఉన్నది ఒక్కడే
ప్రత్యక్షంగా వాడిని ఎదిరించలేము
అందుకే వాడిని తప్పించుకు తిరగాలి
ప్రాణత్యాగం చేయని దేశ రక్షకుడవై
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు తెరలు కట్టి
మంది మార్బలంకు దూరంగా ఉంటూ
తరచూ చేతులను శుభ్రపరచుకునే సైనికుడివి కావాలి
దేహ రక్షకుడవై దేశాన్ని కాపాడాలి
కరోనాను కాలరాసే
సైనికుడు కావాలి
- లలిత ప్రవల్లిక



