నువ్వు నవ్వావని
నువ్వు నవ్వావని
నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని
వనమంతా విరులైతే తెలిసింది నువ్వు నవ్వావని
తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని
కలతంతా సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని
మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని
ఎదలోనే రవమైతే తెలిసింది నువ్వు నవ్వావని
ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని
నెలరాజా కనిపిస్తే తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని ...
-- శ్రీ
