ప్రేమే
ప్రేమే

అవునుగా మరి
కనురెప్పల వెనుక ప్రతిష్టించి
కలల అభిషేకాలతో
నన్ను ముంచెత్తావని..
తియ్యటి మనసుని
ప్రసాదమిచ్చి
వేవేల క్షణాల హారతిలో
ఆర్తిగా నువ్వు కరిగావని
నాకెలా తెలుస్తుంది
మరింతగా
మరీ ఇంతగా
మరెంతగా
నన్నిలా
నన్నే ఇలా
నావనేలా
నీవిలా మారి
నీలోని నాకు
నాకైన నీకు
ఇవ్వగలిగింది
నువ్వలిగింది
నవ్వు 'అలిగింది'
దీనికేగా!
ప్రేమనే
ప్రేమైన
ప్రేమించిన
పేరు పేరు
'ప్రేమ' అని
ప్రేమించడానికి నాకు దొరికిన
ఒకే ఒక కారణం
నన్ను ప్రేమించడం!
ఇంతకంటే చెప్పడానికి
మాటల్లేవ్
దేనికంటే
మాటల్లోని మౌనం
మౌనం లోని మాటల మధ్య
ఘర్షణేపాటిదో
రుచి చూసిన నీకు
తెలుసని ఈ మాట!
{మాటల్లేవని చెప్పక
ఒక మాట చెప్పు
మౌనానికీ ఒక మాటిచ్చేలా!!}
- రఘు ఆళ్ల



