జీవిత సత్యం
జీవిత సత్యం
.png)
నవరంధ్రముల ఖజకములో
పంచ వాయువులు
ఉన్నంత వరకే కదా..!
వ్యక్తి విలువ..!!
హృదయానికి చిల్లు..అదే
నీ జీవితానికి శాపపు విల్లు..!!
ప్రాణం ఉన్నంత వరకు
చిరునవ్వు వెదజల్లు..!!
అందరి ప్రేమను భద్రించు
నీ హృది పొదరిల్లులో..!!
తప్పులను ఒప్పుకొని
పరమాత్మ యందు క్షమ
ప్రార్థనతో మోకరిల్లు..!!
జీవితం ఇంకా అయ్యెను
అందమైన హరివిల్లు..!!
తనువు అణువు అణువులో
కృతజ్ఞతా భావాన్ని నింపుకో నువ్వు..!!
నీ నవ్వు నవ్వులో పసిడిపువ్వు
అదే మాకు పసిడి పువ్వులపంట అవ్వు ..!!
శపించిన శఠించిన..!!
విఘ్నాలు కలిగించిన..!!
అవరోధాలే సృష్టించిన..!!
అన్నింటిని పెకలించు..!!
సాగు సాగు మున్ముందుకు
నీ బాటలే కావాలి మాకు
విజయ మార్గములు ఓ నేస్తం..!!
జాని.తక్కెడశిల



