Facebook Twitter
నా అన్నవారే లేని పుడక

ఊహ తెలియని వయసు
నిస్వార్థమైన మనసు
నిర్మాల్యమైన వర్చస్సు
అమ్మ పొత్తిళ్ళలో ఆడుకోవాల్సిన ఈడు
రహదారి ప్రక్కన అడుక్కుంటుంది
పాలు తాగే ప్రాయంలో
పైసల కోసం ప్రార్థిస్తుంది
పరుగులు తీసే పట్టణంలో
పలకరింపుకై ప్రతీక్షిస్తుంది
ఆకలేసి అమ్మా అని అరిచినా
ఆశతోటి అయ్యా అని అడిగినా
పుట్టల్లో పోచే పాలు
ఆ పొట్టలు నోచుకోవు
చెత్త బుట్టల్లో పారవేసే అన్నాలు
ఆ పొత్తి కడుపులకు పరమాన్నాలు
నడక దారే పడక
నా అన్నవారే లేని పుడక


 

రచన : వెంకు సనాతని