Facebook Twitter
ఆన్నదాత సుఖీభవ !

యేరువాక దారికేసి
అడుగుల్ని కదిపితే
మాగాణి 
మురిసి మైమరుస్తుంది
నదిలా కదిలి
నారుకు నీరు పెడితే
పైరు ప్రపంచానికి
పచ్చని ప్రమిధై
రేపటి వెలుగులకు
ఉషోదయమై నిలుస్తుంది
పైరంతా ఎదిగి,ఎదిగి
పంట చేతికొస్తే
ఆశలు రివ్వున ఎగిరే
పాలపిట్టలౌతాయి
అప్పుడప్పుడూ
ఆశలు నిరాశలై
ఆకాశమంత దిగులు
గుండె గూడును
చిధ్రం చేస్తాయి
ఎన్నో కలల్ని
కంటి పాపపై నింపుకొన్నాక
గాలో,అకాల వర్షమో
పంట చేతికి అందే సమయంలో
ప్రళయ ఘర్జనలతో
బ్రతుకుని అతలా కుతలం చేస్తుంది
దారంటూ ఒకటి ఎంచుకొన్నాక
ముల్లున్నా , రాళ్ళున్నా
ఈతి భాధలున్నా, ఆర్థికంగా చితికినా
ఎదురొడ్డి నిలిచి నడిచే
మహా ఋషి అతను
అన్నదాత శుఖీభవా అని
దీవించడమే మన ముందున్న కర్తవ్యం...!!

 



మహబూబ్ బాషా చిల్లెం