Saggubiyyam Kheer (Ugadi Special )

 

 

సగ్గుబియ్యం ఖీర్
(Ugadi Special)

 

 

 

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - పావు కప్పు
నీళ్లు - అరకప్పు
పాలు - మూడు కప్పులు
చక్కెర - పావుకప్పు
బాదంపప్పులు - పది
కిస్ మిస్ - పది
యాలకుల పొడి - చిటికెడు
నెయ్యి - నాలుగు చెంచాలు

 

తయారీ విధానం:

చెంచాడు నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెటు్టకోవాలి. సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీళ్లు ఒంపేసి, మళ్లీ మంచినీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. సగ్గుబియ్యం ట్రాన్స్ పరెంట్ గా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత మంట సిమ్ లో పెట్టి పాలు పోయాలి.

ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించాక చక్కెర, యాలకుల పొడి వేసి మూత పెట్టాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఇరవై, ఇరవై అయిదు నిమిషాల పాటు ఉడికంచాలి.  ఆపైన జీడిపప్పు, కిస్ మిస్ వేసి, నెయ్యి కూడా వేసి కలిపి దించేయాలి.

 

- sameeranj