Mango Ice Cream
మ్యాంగో ఐస్ క్రీం
కావలసినవి:
మామిడికాయలు - 3
పంచదార - ఒక కప్పు
నిమ్మరసం - 1 స్పూన్
పాలు - 1 లీటర్
ఐస్ క్రీం పౌడర్ - 2 స్పూన్స్
తయారీ:
ముందుగా మామిడి కాయను తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సిలో వేసి నిమ్మరసం,పంచదార కలిపి బాగా గుజ్జుగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు పెట్టి బాగా మరిగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నమామిడి గుజ్జును వేసి బాగా కలపాలి. తరువాత ఐస్ క్రీం పౌడర్ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆ మిశ్రమం చల్లారిన తరువాత డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత సర్వింగ్ కప్స్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి
Recommended for you
