ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం కాదు.. నీతి ఆయోగ్ సిఫారసు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. వారి ప్రసంగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా  వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన, ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే మెగా డీఎస్సీపైనే తన తొలలి సంతకం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ ను, ఆయన సర్కార్ ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదనీ, దానిని రద్దు చేయడం సాధ్యం కాదనీ పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.  అయతే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణననలోనికి  తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతీ ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమలులోకి తీసుకువచ్చేసింది.   తాను కూడా ఆ చట్టానికి బాధితుడినేనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి  పూర్తిగా ఉంది. అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. 
Publish Date: May 6, 2024 3:57PM

ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ ఇన్ చార్జ్  డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు.  ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు. వీరిలో 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఈసీ ఖరారు చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.  మొత్తం మీద ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల వేళ, కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడాన్ని తెలుగుదేశం కూటమి స్వాగతిస్తున్నది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నెలన్నర తరువాత ఈ బదిలీ జరగడం గమనార్హం, ముఖ్యంగా అనకాపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి అనంతరం ఎన్నికల సంఘం రాష్ట్రంలో  శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ సాయంత్రం  ఆయన బాధ్యతలు చేపట్టారు. 
Publish Date: May 6, 2024 3:29PM

రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్! పట్టు కోల్పోతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గడ్ దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది.  వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గడిచిన మూడు నెలల్లో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బంది సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం ఒక్క బస్తర్‌ రీజియన్‌లోనే 80 వేల మంది డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.  తెలంగాణ సరిహద్దులో ఉండే మావోయిస్టుల కంచుకోట పూవర్తి, తెర్లం  నుంచి  అబూజ్‌మడ్‌ అడవుల వరకు 400 కిలోమీట‌ర్ల మేర పోలీసులు క్రమంగా క్యాంపులను విస్తరించారు.  అడవిలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపు ఏర్పాటైంది. ఒక్కో క్యాంపులో 2 వేల నుంచి 5 వేల వరకు బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గడిచిన మూడున్నర నెలలుగా ఎన్‌కౌంటర్లు పెరిగాయి.  అబూజ్ మడ్ దట్టమైన  అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.  బాహ్య ప్రపంచానికి ఆవల.. ఎక్కడో విసిరివేయబడ్డట్టుంటుంది అబూజ్ మడ్. దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగేయడమే కష్టం.  4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం… నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలతో పాటు.. ఇటు తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లా.. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్స్ లో విస్తరించి ఉంది. నక్సల్స్ ఈ అబూజ్ మడ్ ను సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకున్నారు. అలా ఈ ప్రాంతం నక్సల్స్ కు ఒక ప్రధాన స్థావ‌రంగా మారింది.  ఈ డెన్ ను కనుక నిర్వీర్యం చేస్తే… ఇక మావోయిస్టులు, ఇతర తిరుగుబాటు దళాల ఉనికే లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో మోదీ సర్కార్ అబూజ్ మడ్ పై దృష్టి పెట్టింది. తరచూ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎన్ కౌంటర్స్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది.  సరిహద్దు భద్రతా దళాలతో పాటు.. జిల్లా రిజర్వ్ గార్డ్ దళాలతో కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి మొత్తంగా అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డానికి కేంద్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.  అబూజ్ మడ్ లో ఇటీవ‌ల జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే 90 మందిని కాల్చి చంపారని హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. నక్సల్స్ స్థావరాలను గుర్తించి డ్రోన్ల ద్వారా విష రసాయనాలను చల్లుతున్నారని మండిపడ్డారు. ఆపై నక్సల్స్ స్పృహ తప్పగానే కాల్పులు జరిపి వారిని మట్టుబెడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఏరివేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల నుంచి.. నేపాల్‌ వరకు రెడ్‌కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్‌ ఇప్పుడు సేఫ్‌జోన్లు లేక సతమతమవుతున్నారా? దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 6, 2024 3:28PM

డబుల్ బెడ్ రూం ఓ బూటకం: బిజెపి 

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్ల మాదిరిగా  కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగి పోయింది. కాంగ్రెస్ ను నిలువరించడానికి బిఆర్ఎస్, బిజెపి చేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఐదు నెలల కాలంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. బిజెపి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయితే రెండో ప్రత్యర్థి మాత్రం బిఆర్ఎస్  అని తెలుస్తోంది . రానున్న లోకసభ ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.  డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల్ని మోసగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆయన విమర్శించారు.  పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ...ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇదివరకు మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, కానీ నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశంలోనే మొబైల్ ఫోన్ల తయారు చేస్తున్నామని తెలిపారు. మేకిన్ ఇండియా ద్వారా తయారైన మొబైల్ ఫోన్లనే మనం వినియోగిస్తున్నట్లు నడ్డా చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్డీకరణ పూర్తయిందని వెల్లడించారు. ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148 కి పెంచామని, లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జేపీ నడ్డా చెప్పారు.
Publish Date: May 6, 2024 3:15PM

ఉపాధ్యాయులు రివెంజ్ కు రెడీ అయిపోయారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏ విధంగా చూసినా రికార్డే. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు లక్షా లక్షన్నర మంది కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఉద్యోగులలలో తమ ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్దగా సుముఖత చూపరు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలంటూ నియోజకవర్గ కేంద్రానికి లేదా మండల కేంద్రాలకు కానీ వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.  అయితే ఈసారి ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం 7, 8 తేదీలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఫారం 12ను సమర్పించి 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. దీంతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందే విషయంలో అవరోధాలు, ఇబ్బందులు ఎదురౌతున్నా పట్టించుకోకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి తమ ఓటు హక్కును వినియోగించుకుతీరాలన్న సంకల్పం వారిలో కనిపించింది. ఈ పట్టుదల, సంకల్పం  వెనుక జగన్ ను గద్దె దించాలన్న తపన కూడా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో  ఉద్యోగులు, మరీ ముఖ్యంగా టీచర్లను అన్ని విధాలుగా వేధింపులకు, అవమానాలకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాన్న వాగ్దానాన్నివిస్మరించడం విషయంలో కానీ, వారికి చట్టబద్ధంగా, న్యాయపరంగా అందాల్సిన అలవెన్సులు, సబ్బిడీల విషయంలో కానీ జగన్ ఏ మాత్రం సానుకూలత లేకుండా వ్యవహరించారు.  ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగుదేశం కూటమికే ఓటు వేయడానికి నిర్ణయించేసుకున్నట్లుగా వారి వాట్సాప్ గ్రూపులలో సంభాషణలు, చర్చల ఆధారంగా వెల్లడౌతోంది. ఉద్యోగులు, టీచర్లు తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలన్న ప్రచారం కూడా టీచర్ల వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   ఫలానా పార్టీ, ఫలానా కూటమికి ఓటు అని ప్రత్యేకంగా చెప్పకున్నప్పటికీ, స్పష్టంగా అధికార పార్టీకి వ్యతిరేకం అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాది.  న భూతో అన్నట్లుగా టీచర్లు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న తీరు మాత్రం జగన్ సర్కార్ తో వారు ఎంతగా విసిగిపోయారో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 6, 2024 3:06PM

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 3

వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఇంతకుముందు రెండు భాగాల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ‘నార్సీ’ మానసిక వ్యాధిగ్రస్తులకు వుండే ఇతర లక్షణాలను చూద్దాం.  జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసింది. వాటిని జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఐదేళ్ళుగా అవి పాడుబడిపోయి వున్నాయి. వాటిని అలా ఉంచేసి, జగన్ సెంటు భూమి పథకం పట్టుకొచ్చాడు. సెంటు భూమి ఎలా సరిపోతుంది? ఆ ఇచ్చే భూమి కూడా ఎక్కడో ఊరు చివరో, మునక ప్రమాదం వున్న ప్రాంతాల్లోనే ఇచ్చాడు. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంకా ఈ స్కీములో ఎన్నో స్కాములు, తిరకాసులు, లబ్ధిదారులను స్థలం ఇచ్చాం కాబట్టి మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయాలంటూ బెదిరించడం.. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. మరి పేదకు ఇళ్ళు సమకూర్చే ఈ పథకాన్ని ఇంత నాశనం చేసిన జగన్, చంద్రబాబు ఇచ్చి టిడ్కో ఇళ్ళు బాగున్నాయని ఎవరైనా అంటే తట్టుకోగలడా.. అందుకే వాటిని పాడుబెట్టేశాడు. జగన్ ఎప్పుడూ దుష్ట చతుష్టయం అనే మాటను వాడుతూ వుంటాడు. జగన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళందర్నీ ఒక తాటిమీద కట్టేస్తాడు.  ఎవరైతే జగన్ ప్రభుత్వం గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళను దొంగలు, దగుల్బాజీలు, అట్లాంటి వాళ్ళు.. ఇట్లాంటివాళ్ళు వాళ్ళ మీద అబద్ధాలు దుష్పచారం చేస్తాడు. చివరికి వాళ్ళు చెప్పే నిజాన్ని కూడా జనం నమ్మని పరిస్థితి తెస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా నిజం చెప్పినా జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇలా జరగడం ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు... ఉదాహరణకు, 10 రూపాయల నాణెం దేశం మొత్తంలో చెలామణీలో వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పదిరూపాయల నాణాన్ని విలన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే, ఎప్పుడో ఒకసారి పదిరూపాయల నాణెం చెల్లదనే పుకారు వచ్చింది. దాన్ని జనం నమ్మేశారు. చదువుకున్నవారు.. చదువుకోనివారు.. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవారు.. అందరూ పదిరూపాయల నాణాన్ని తీసుకోవడం మానేశారు. పదిరూపాయల నాణెం చెల్లదని అంటే జైలుకు పంపిస్తామని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా జనం ఇప్పటికీ పది రూపాయల నాణాన్ని మిగతా కాయిన్స్.ని నమ్మినట్టుగా నమ్మరు. పుకారుకు వున్న బలం అలాంటిది. జగన్ అండ్ టీమ్ కూడా తమను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా రకరకాల పుకార్లు పుట్టిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ నిజాలు చెబుతూ వుండేసరికి వాటికి టీడీపీ రంగు, కులంరంగు పులుముతారు. వాళ్ళూ వాళ్ళూ ఒక కులం వాళ్ళు కాబట్టి జగన్‌కి వ్యతిరేకంగా ఈ న్యూస్ రాసి వుంటార్లే అని జనం అనుకునేలా చేయడం ఒక వ్యూహాత్మక కుట్ర. న్యూట్రల్‌గా వున్నవారిని కూడా ప్రజలు నమ్మకుండా చేసే భయంకరమైన కుట్ర. ఇదే నార్సీ విధానం. ఆమధ్య చంద్రబాబు నాయుడు భార్య మీద దుర్మార్గమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మాట్లాడుతూ రోదిస్తే, దాన్ని మీడియాలో చూపించీ చూపించీ.. అతను ఏడవడం లేదు.. డ్రామా చేస్తున్నాడు అంటూ  జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మనిషి అనేవాడు పగవాడు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటే కొంచెమైనా చలిస్తాడు. అయ్యో అనుకుంటాడు. అదే ఒక మనిషి ఏడుస్తుంటే చూసి మనసు నిండా విశృంఖలంగా ఆనందం కలిగితే దాన్ని శాడిజం అంటారు. ఆ శాడిజం పుష్కలంగా కలిగిన వ్యక్తి జగన్. తనకున్న శాడిజాన్ని తనను నమ్మే వారి మనసులలో కూడా బలంగా నాటడమే ఈ నార్సీ విధానం. నార్సీ మానసిక వ్యాధి వున్నవాళ్ళు తనను అనుసరించే వాళ్ళలో వున్న రాక్షసత్వాన్ని నిద్ర లేపుతారు.  (ఇంకావుంది)
Publish Date: May 6, 2024 2:53PM