దంగల్ బాలనటికి విమానంలో వేధింపులు
posted on Dec 10, 2017 10:15AM

అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన దంగలో సినిమాలో బాలనటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది జైరా వాసీం. ఇప్పుడు దేశంలో ఏ మూలకి వెళ్లినా ఆమెను గుర్తుపట్టని వారు లేరు. అలాంటి జైరాకి చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా విమానంలో ప్రయాణిస్తోంది జైరా వాసీం.. ఆ సమయంలో తోటి ప్రయాణికుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ పరిణామంతో జైరా తీవ్ర మనస్తాపానికి గురైంది. కన్నీటిని దాచుకుంటూ, వీడియో రూపంలో తన ఆవేదనను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన వెనుక సీట్లో కూర్చొన్న మధ్య వయస్కుడైన వ్యక్తి, తన మెడను తాకుతూ.. సీటు కింద నుంచి కాళ్లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడని.. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి ఎదురుకాకూడదని పేర్కొంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో అమ్మాయిలకు ఎలాంటి భద్రత కల్పిస్తారో ఈ ఘటనతో అర్థమవుతోందని.. ఎవరికి వారే సహాయం చేసుకునేలా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.