అనంతలో ఆగని టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు
posted on Jun 5, 2016 6:41PM
.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అనంతలో అగ్గి రాజేశాయి. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంత నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. అసలే కోపంతో ఊగిపోతున్న టీడీపీ కార్యకర్తల ముందు వారు జగన్‌కు జిందాబాద్‌లు కొట్టడంతో తెలుగుదేశం శ్రేణులకు చిర్రెత్తుకువచ్చింది. దీంతో వైసీపీ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.