బినామీ పేర్లతో సిక్కింలో జగన్ పెట్టుబడులు!
posted on Nov 11, 2011 11:37AM
హైదరా
బాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు,వైయస్ జగన్మోహన్ రెడ్డి సిక్కిం రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టినట్లుగా ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.అంతేకాక సిక్కింలో రెండు విద్యుత్ ప్రాజెక్టులను బినామీ పేర్లతో జగన్ నిర్మిస్తున్నారన్న ఆరోపణలు చాన్నాళ్లుగా ఉన్నాయి. దీంతో జగన్ ఆక్రమాస్తులపై సమగ్ర విచారణ జరుపుతున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం సిక్కింలోని అక్రమ విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారంపైనా దర్యాప్తునకు సిద్ధమవుతోందట.
కాగా ఈ రెండు ప్రాజెక్టులకూ అవసరమైన పెట్టుబడి జగనే సమకూరుస్తున్నారని గ్యాంగ్‌టక్ వాసి ఆనంద్ లామా చెబుతున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో పలు ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ సిక్కిం హైకోర్టులో ఆయన పిల్ దాఖలు చేశారు.జగన్ అక్రమ పెట్టుబడులపై సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన పలు కీలక పత్రాలను తన ఆరోపణలకు మద్దతుగా కోర్టుకు లామా సమర్పించారు. ఈ సమాచారంతో లామా సిబిఐని ఆశ్రయించారు. సిక్కింలో జగన్ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆర్థిక అక్రమాలను ఆరా తీయాలంటూ సిబిఐ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.