ఓదార్పు యాత్రలో ఓటర్లకు జగన్ సూచన
posted on Dec 28, 2011 4:30PM
కడప: వై
యస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్ కడప జిల్లాలోని తన ఓదార్పు యాత్రలో ఓటర్లకు సూచనలు చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తన ఓదార్పు యాత్రలో ప్రజలను కోరారు. ఉప ఎన్నికల్లో ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని కానీ మీరు మాత్రం ఢిల్లీకి దిమ్మ తిరిగేలా వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించాలన్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు రైతులకు తోడుగా నిలిచి అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు.రైతు - రైతు కూలీ ఒకవైపు ఉంటే కుళ్లు రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉందన్నారు.విశ్వసనీయతకు రాజకీయ నేతలు అర్థం మరిచారన్నారు. నేతలు దానిని పూర్తిగా పూడ్చి పెట్టారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు తేవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు ఉప ఎన్నికల్లో రైతన్నే గెలుస్తాడని, తద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు.