కృష్ణా జిల్లాలో వైకాపా నేత హత్య

 

కృష్ణా జిల్లాలో వైకాపాకు చెందిన శ్రీశైలం వాసు అనే పార్టీ నేతను గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్చి చంపి పారిపోయారు. ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్న అతనికి వ్యాపారపరంగా ఎవరయినా శత్రులున్నారా లేక వేరేవరయినా హత్య చేసారా? అనే సంగతి పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఆయన తన దుఖాణంలో కూర్చొని ఉండగా గుర్తు తెలియని ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ పై వచ్చి ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు సమాచారం. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే దారిలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దుండగుల ఆచూకి కనిపెట్టేందుకు కృషి చేస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu