నేను జగన్ వర్గం ఎమ్మెల్యే నే: జయసుధ
posted on Nov 11, 2011 7:51AM
హైద
రాబాద్: తాను ముమ్మాటికీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేనని సహజ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చేర్యాల గురువారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో పాటు ఆమె పాల్గొన్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ వైపు మరలుతుందో అన్న ఊహాగానాలు రావడంఫై ఆమె వివరణ ఇచ్చారు.తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పనుల కోసం, నియోజవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నట్టు వివరణ ఇచ్చారు. దీనిని మరో కోణంలో చూడొద్దని కోరారు.
కాగా రెండు రోజుల క్రితం ప్రజలు అవినీతిపరులు అయిపోయారన్న తన వ్యాఖ్యలపై కూడా ఆమె వివరణ ఇచ్చారు.దీనిపై ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు. సాధారణంగా ఉన్న విషయమే చెప్పానని డబ్బులు తీసుకున్న వారికి మాత్రమే తన మాటలు వర్తిస్తాయని, తీసుకోని వారు ఏమాత్రం బాధపడరన్నారు.