నాదెండ్ల మనోహర్ కి జగన్ ఆఫర్

 

నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. జనసేనలో మనోహర్ కి పవన్ సముచిత స్థానం ఇచ్చారనే చెప్పాలి. ఎప్పుడు మనోహర్ పవన్ వెంటే కనిపించేవారు. అయితే మనోహర్ జనసేనలో చేరకముందు.. వైసీపీ అధినేత జగన్ ఓ ఆఫర్ ఇచ్చారట.

మనోహర్ విషయంలో గతంలో జగన్ ఒక ఆఫర్ ఇచ్చారని ఆయన తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. మనోహర్ ఇంకా జనసేనలో చేరకముందే తాను జగన్ తో మనోహర్ విషయం కోసం చర్చించినపుడు.. మనోహర్ కి ఎమ్మెల్యే సీటు అయితే ఇవ్వడం కష్టం కానీ ఎమ్మెల్సీ మాత్రం జగన్ ఆఫర్ చేసారని తెలిపారు. కానీ మనోహర్ ది ఎమ్మెల్సీ స్థాయి కాదని అప్పుడు జగన్ ఇచ్చిన ఆఫర్ ను వారు సున్నితంగా తిరస్కరించారని తెలిపారు.