కేసీఆర్ చేసిందే జగన్ చేస్తే... వర్కవుట్ అవుతుందా?

చలికాలంలో రోగమొస్తే వేసుకున్న మందే ఎండాకాలంలో వచ్చిన మరో రకం రోగానికీ ఎవరైనా వేసుకుంటలారా?వైఎస్ జగన్ అలాంటి ఘనకార్యమే చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది!అసలు విషయం అర్థం కావాలంటే మనం ఒకసారి రాష్ట్ర విభజన ముందు నెలకొన్న పరిస్థితుల్లోకి వెళ్లాలి...
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదే పదే ఒక అస్త్రం ప్రయోగించే వారు.అదే రాజీనామా అస్త్రం.ఓ సారి తాను ఒక్కడే చేస్తే మరోసారి పార్టీ ఎమ్మేల్యేలు,ఎంపీలు అందర్నీ రాజీనామా చేయించేవాడు.ఇలా ఆయన ఎప్పటికప్పుడు తన రెసిగ్నేషన్ స్ట్రాటజీతో జనంలో వుండే వారు. ఉద్యమం సెగ తగ్గకుండా చూసుకునే వారు!
వైఎస్ జగన్ కేసీఆర్ అప్పట్లో వాడిన అస్త్రం ఇప్పుడు ప్రయోగిద్దామనుకుంటున్నాడు!ఇదే అసలు సమస్య.అప్పుడు రాజీనామాల ప్లాన్ వర్కవుట్ అయింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అనుకోవటం అవివేకం.అందుకు కారణం మారిపోయిన పరిస్థితులు,మారిపోయిన డిమాండ్లే!
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఎమోషనల్ అంశం ఆసరా చేసుకుని ఓట్ల కోసం వెళ్లారు.అయినా కూడా కొన్ని సార్లు బొక్కబోర్లా పడ్డాల్సి వచ్చింది.కాని,ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అంత ఎమోషనల్ టాపిక్ ప్రత్యేక హోదా కాదు.జనానికి హోదా రావాలని వున్నా ప్రత్యేక ప్యాకేజీతో ఆల్రెడీ కేంద్రం కొంత సాటిస్ ఫై చేసేసింది.మరో వైపు ప్రత్యేక హోదా ఇక మీదట సాధ్యం కాదని క్లియర్ గా చెప్పేసింది.కేవలం ఆంధ్రాకే కాదు దేశంలో ఎవ్వరికీ ఇవ్వబోమని ఢిల్లీ పాలకులు చెప్పేశారు.మరి ఇటువంటి సమయంలో వైఎస్ జగన్ రాజీనామా అస్త్రం ఎంత వరకూ పని చేస్తుంది? కేసీఆర్ ఆంధ్రా వాళ్లని టార్గెట్ చేసినట్టు జగన్ ఎవ్వర్ని టార్గెట్ చేసి ఓటర్లని ఆకర్షిస్తాడు? కేంద్రాన్ని బలంగా విమర్శించే ఛాన్స్ లేదు.అంత దైర్యం అనేక కేసుల్లో ఇరుక్కున్న జగన్ కు వుంటే ఈపాటికే ఎన్నో సార్లు విమర్శలు చేసి వుండేవాడు!కాని, ఇంతవరకూ మోదీని,కేంద్రాన్ని పల్లెత్తు మాట ఆయన అనట్టు ఎక్కడా కనిపించలేదు. ఇక మిగిలింది చంద్రబాబుని, టీడీపిని తిట్టిపోయటం! దీని వల్ల ప్రత్యేక హోదా రాదని తెలుసుకోలేనంత పిచ్చి వాళ్లా జనం? టీడీపి ఒత్తిడి వల్ల రావాల్సిన ప్యాకేజ్ వచ్చింది. ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసమని మెజార్జీ జనం భావిస్తున్నారు. మరి ఇటువంటప్పుడు జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయించి ఏం సాధిస్తాడు? ఎవరి మీద పోరాడతాడు?
జగన్ తన ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ దశలో ఎంపీల చేత రాజీనామా అంటూ ప్రకటించాడు.నిజంగా ఎంపీల చేత ఆయన రీసైన్ చేయిస్తారో లేదో మనకు తెలియదుగాని దాని వల్ల ప్రజలకు మాత్రం తీరని నష్టమే.త్వరలో మున్సిపల్ ఎన్నికలు వున్నాయి. అవ్వి అయ్యే వరకూ ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా ఆగిపోతాయి. ఇలా లబ్ది పొందకుండా వున్న జనం జగన్ రాజీడ్రామాలతో మరికొంత కాలం సంక్షేమ పథకాలకి ముఖం వాచిపోవాల్సి వస్తుంది. పైగా జగన్ ఎంపీల రాజీనామా స్టేట్మెంట్లో హోదాపై ప్రేమ కన్నా పొలిటికల్ కాలిక్యులేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆయనకు వున్న ఎంపీలంతా రాయలసీమ జిల్లాల్లోనూ, ప్రకాషం, నెల్లూరు జిల్లాల్లోనూ వున్నారు. వాళ్ల చేత రాజీనామా చేయించినా తిరిగి గెలుచుకునే అవకాశాలు ఎక్కువ. అక్కడ చంద్రబాబు ప్రభావంగాని, టీడీపీ బలంగాని పెద్దగా టెన్షన్ పెట్టే సూచనలు కనిపించటం లేదు. ఈ భరోసాతోనే జగన్ రాజీనామా అస్త్రం అంటున్నాడని మనం అంచనాకి రావొచ్చు.పైగా ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా ప్రజలు టీడీపీ పాలనని వ్యతిరేకిస్తున్నారని ఋజువు చేయవచ్చు.ఇదీ జగన్ వ్యూహం... 
ఇక ఫైనల్ గా జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తే ఆయనకున్న మరో లాభం ఓదార్ప యాత్ర న్యూ సీజన్! అవును... తండ్రి పోయాడన్న కారణంతో జగన్ నెలల తరబడి రోడ్లపై వున్నాడు. ఓదార్చి ఓదార్చి జనం తనని మరవకుండా జాగ్రత్తపడ్డాడు. కాని, ఇప్పుడు మరోసారి వీదుల్లోకి వెళ్లాలంటే అలాంటి కారణం ఏం దొరకటం లేదు. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం రాజీనామానే! ఎంపీల రాజీనామా అంటే బోలెడన్ని ఊళ్లూ, పట్టణాలు చాలా రోజుల వరకూ చుట్టి రావచ్చు. మీడియాలోనూ తప్పనిసరి పబ్లిసిటీ. ఇంతకంటే ప్రతిపక్ష నేతకి కావాల్సింది ఏముంటుంది? 
ఇప్పటికైతే జగన్ కన్ ఫర్మ్ గా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పలేదుగాని అదే జరిగితే జగన్ కు వచ్చే లాభం ఎక్కువ. జనానికి వచ్చే లాభం శూన్యం. ఎందుకంటే, హోదా ఇవ్వటం అనేది వైసీపీ ఎంపీలు కాదు మొత్తం ఆంద్రా ఎంపీలు అంతా రాజీనామా చేసినా ... 14వ ఆర్దిక సంఘం చెప్పేసింది కాబట్టి... కుదరని పని! అంతకు మించి ఉప ఎన్నికలు జరిగే దాకా నెలల తరబడి ఎలక్షన్ కోడ్ అమలు కావటంతో సామాన్య జనం సంక్షేమ పథకాలకి దూరం అవుతారు. ఇదీ జగన్ రాజడ్రామాతో కలిగే ప్రయోజనం!