అతి సర్వత్రా జగనేత్!

 

క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.. శ్రీమాన్ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనుల వారు.మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకూ అభ్యర్ధుల జీవితాలను అగమ్య గోచర పరిస్థితిలోకి నెట్టిన జగనన్న తాజాగా.. ముందస్తు ఎన్నికల్లాగా- ముందస్తు అభ్యర్ధుల ఖరారు ప్రకటనలు చేస్తున్నారట. ఇప్పటికి ఓకే అయిన వాటిలో మచ్చుకు కొన్ని పేర్లు.. ఎవరివీ, ఏంటని చూస్తే వాటిలో తొలిపేరు సర్వేపల్లి నుంచి- కాకాణి గోవర్ధన రెడ్డిదేనట. ఇక వరుసగా చూస్తే.. నరసన్న పేట- ధర్మాన కృష్ణదాస్, గననవరం- నుంచి వల్లభనేని వంశి, మచిలీపట్నం- నుంచి పేర్ని నాని, గుడివాడ- నుంచి కొడాలి నాని, దెందలూరు- నుంచి అబ్బయ్య చౌదరి, తాడికొండ- నుంచి 

నందిగం సురేష్, మాచర్ల- నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరి పేట- నుంచి విడదల రజనీ, తాడిపత్రి- నుంచి పెద్దారెడ్డి, రాఫ్తాడు- నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం- నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పాతపట్నం- నుంచి రెడ్డి శాంతి.. ఇలా ఒక లిస్ట్ అప్పుడే లీక్ చేశారట. అంటే గతంలోలా పార్టీకి డిమాండ్ లేక పోవడం.. దానికి తోడు కేడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహలకు లోను కావడంతో ఒక బూస్టింగా ఉంటుంది లెమ్మని జగన్ సార్ ఈ తరహాలో ముందుకెళ్తున్నట్టు తాజా కబర్. ఒక సమయంలో ఎమ్మెల్యేలను కలవడానికే అపాయింట్లు ఇవ్వని.. ఒక వేళ ఇచ్చినా వారిని నిలబెట్టే మాట్లాడే కల్చర్ గల జగనన్న.. ఇటీవల నేనూ మారాను బాస్! అని తెలియ చెప్పడంలో భాగంగా ఈ అడ్వాన్స్డ్ అనౌన్స్ మెంట్స్ ఒక పాలసీగా తీసుకున్నట్టు సమాచార్.

రేపటికి రెడ్డెవరో- రాజెవరో అన్నది పాత నాటు సామెత. కానీ ఆ రేపటి ని కూడా ఇప్పటి నుంచే మార్చేసి.. తనకు తాను ఎప్పటిలాగానే అధినాయకుడిలా కాకుండా 'అతి'నాయకుడిలా వ్యవహరిస్తున్నారట జగన్. దానికి తోడు ఇప్పటికే ఈ అతి మీద పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాటలను బట్టీ చెబితే.. ఈ వైనాట్ 175 వంటి టూ మచ్ స్లోగన్స్ ఎవరి ఐడియాలో తెలియవు కానీ, ఇవన్నీ పార్టీని నిలువునా ముంచాయని అంటారాయన. దీంతో సామాన్యంగా వ్యవహరించాల్సిన జగన్ అత్యుత్సాహం కొద్దీ ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీ మైలేజ్ మరింత డ్యామేజ్ గా మారుతున్నట్టు సమాచారం. 

మరి చూడాలి. జగన్ సార్ ఇదే ఫ్లో మెయిన్ టైన్ చేసి. ఆ పదకొండు కూడా పోగొట్టుకుంటారా అన్నది తేలాల్సి ఉందంటున్నాయి.. పార్టీ శ్రేణులు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎన్నికలు వచ్చినట్లు నాలుగు ఏళ్ల ముందే ఊహించడం, తామే గెలుస్తామ‌ని క‌ల‌లు క‌న‌డం.. ఆ ఊహ‌ల్లో తేలియాడ‌టం.. అలా బతికేయడాన్ని ఏమనుకోవాలి? మానసిక సమస్యా.. లేక వేరే వ్యూహమా? నేతల్ని, కార్యకర్తలను తనతో నిలుపుకోవడం లో భాగమా? అన్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే జ‌గ‌న్  చేసిన ప్ర‌తి ఓవ‌రాక్ష‌న్ బెడిసికొట్ట‌డంతో.. ఇలాంటి విష‌యాల‌ను పార్టీలో కొంద‌రు బాహ‌టంగానే వ్య‌తిరేకిస్తున్నార‌ట‌.