ఫేస్ బుక్ లో పెళ్లి సంబంధాలు.. రూ . 11.70  లక్షలు  ఛీటింగ్.. 

ఒకప్పుడు ఏ పని చేసిన, చేయకపోయిన పెళ్లి మాత్రం సకాలంలో చేసుకునే వాళ్ళు. కానీ ఈ పోటీ ప్రపంచంలో మనిషికి పుట్టడం లేట్, ఆ మనిషికి  ఉద్యోగం రావడం లేట్. పెళ్లి  చేసుకోవడం లేట్. పిల్లలు కననడం లేటు. ఇలా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనిషి అన్ని లేట్ గానే చేసుకుంటున్నాడు. ఏ విషయం లో లేట్ అయినా పర్లేదు గానీ, ఒక పెళ్లి విషయం లో లేట్ అయితే సర్వమంగళమే.. పెళ్లి విషయంలో కూడా  రెండు మూడు సంవత్సరాలు లేట్ అయితే ఒకే, మరి ముదిరితే  అమ్మాయిలు అమ్మాయిలను చేసుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కూరగాయల షాప్ లో ముదిరిన బెండకాయల. అమ్మాయి గాని అబ్బాయి గానీ ముదిరింరంటే మూడు ముళ్ళు పడడం కష్టమే.. ఆ తర్వాత ఎవరు వచ్చిన పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు.. ఎవరు వచ్చిన చేసుకుందాం అనే సందేహం వచ్చిన వాళ్ళ డోర్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు. చివరికి అలాంటి వాళ్ళే మోసపోతున్నారు.  ఎలానో మీరే చూడండి.. 

 
ప్రేమ, పెళ్లి  ఈ రెండు పేర్లతో జరగని మోసం లేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో పెళ్లంటే లైట్ తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా. ఆమె పేరు పతంగి మహేశ్వరి, అలియాస్ ధరణి రెడ్డి. మహేశ్వరి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కానీ ఆమె పేరుతో కాదు. ఇందు దాసరి అనే ఫేక్ పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ ఓపెన్ చేసింది. ముందుగా ఇన్బాక్స్ లో హాయ్ అని సెండ్ చేస్తుంది. ఆ తర్వాత మగాళ్ల వీక్నెస్ పట్టుకుంటుంది. అందులో పరిచయం అయ్యే యువకులకు వలపు వల విసురుతూ వారి వద్ద నుంచి డబ్బులు దండుకోవటం మొదలెట్టింది. పెళ్లి సంబంధాలు పేరుతో అబ్బయిల ప్రొఫైల్ మార్చి ఫేక్ ఐడీలను క్రియేట్ చేసింది. ఈ క్రమంలో కొందరు అబ్బాయిలతో పరిచాయలు పెంచుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసింది. 

ఈ క్రమంలో ఆమెపై హైదరాబాద్‌ కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి డబ్బులు తీసుకోవడమే కాక సోషల్ మీడియాలో తాము షేర్‌ చేసిన ఫొటోలను ఉపయోగించి పెళ్లి సంబంధాల పేరిట ఆడపిల్లల తల్లిదండ్రుల వద్ద సంబంధం కుదిరిస్తానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని అతడితో నగ్నంగా వీడియో చాటింగ్‌ చేసి వాటిని వేరే వారికి చూపిస్తానని బెదిరించేదన్నారు. అంతేకాకుండా అతని బంధువు, సోదరుడైన బొమ్మెల అనుదీప్‌ అనే వ్యక్తితో సైతం సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని అతడి ఫొటోలను సేకరించి మూడు నెలలుగా డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుందన్నాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్నదని చెప్పారు. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని హెచ్చరిస్తుందని తెలిపాడు.

పెళ్లి సంబంధాల పేరుతో అబ్బాయిల ఫోటోలు పేర్లు మార్చి.. వాళ్ల ప్రోఫైల్ మార్చి చెపుతూ మోసాలకుపాల్పడిందని పోలీసులు హెచ్చరించారు. పలువురు బాధితుల వద్ద నుంచి ఆమె ఇటీవలల రూ. 11.70 లక్షలూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పదుల సంఖ్యలో ఆమె బాధితులు ఉన్నారు. ఈ కిలాడీ లేడీ నల్లగొండ పట్టణంలోని వన్‌ టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్నట్లుగా గుర్తించి నల్లగొండ వన్‌ టౌన్, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. ఈ లేడీపై కూకట్‌పల్లి, ఘట్‌ కేసర్, ఖమ్మం, సత్తుపల్లి, వేంసూరు పోలీస్‌స్టేషన్లతో పాటు కరీంనగర్‌ షీటీమ్, గచ్చిబౌలి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు.