చీపురు పట్టిన యోగి..

 

ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరనుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న యోగి ఆధిత్యనాథ్.. ఇప్పుడు ఏకంగా తానే చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల జాబితాలో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీనికిగాను రాష్ట్ర పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన యోగి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని స్వచ్ఛ రాష్ట్రానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఉదయం తానే స్వయంగా చీపురు చేతబట్టి లఖ్‌నవూలోని బాలు అడ్డా కాలనీలో రోడ్డు వూడ్చారు. ఆయనతో పాటు సీనియర్‌ కేబినెట్‌ మంత్రి సురేశ్‌ కన్నా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu