యోగాలో బాబా రాందేవ్‌ను మించిపోయిన యోగి

భారతదేశంలో యోగాకి కేరాఫ్ అడ్రస్ అంటే బాబా రాందేవ్‌ అనే చెప్పాలి. మరుగున పడిపోతున్న యోగాకి తిరిగి పునర్ వైభవాన్ని తీసుకురావడంతో రాందేవ్ కీలకపాత్ర పోషించారు. అలాంటి బాబా రాందేవ్‌కు చెమటలు పోయించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు సన్నాహకంగా లక్నోలోని రాజ్‌భవన్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రాంనాయక్ పాల్గొన్నారు. రాందేవ్‌తో పోటిపడి మరి యోగాసనాలు వేశారు యోగి..కాగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్నోలో 50 వేల మందితో కలిసి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు యోగాసనాలు వేయనున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu