ప్రలోభాలు, బెదరింపులతో వైసీపీ స్వైర విహారం.. బీటెక్ రవి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు వంద కోట్లు ఖర్చు చేసిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. వైసీపీ నేతలు ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేశారనీ, పోలింగ్ ప్రారంభమైన తరువాత కూడా ఈ పంపిణీ సాగుతోందని పేర్కొన్న ఆయన.. అవినీతి సొమ్మును జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని విమర్శించారు.  

జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించారనీ, వైసీపీకి అనుకూలంగా పని చయకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించానీ బీటెక్ రవి చెప్పారు.  ముందు ఓటర్లను ప్రలోభపెట్టారు. ఫలితం కనిపించకపోయే సరికి బెదరింపులకు దిగారని అన్నారు. మూడున్నర దశాబ్దాలలో పులివెందులలో తొలి సారిగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతన్నాయన్న ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి ఓట్లు రావన్న భయంతో ఇష్టారీతిగా తెలుగుదేశంపైనా, ప్రభుత్వంపైనా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు.  అయితే పులివెందుల ప్రజలు అన్నీ గ్రహించారనీ, తెలుగుదేశంవైపే నిలిచారని బీటెక్ రవి అన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu