ఢిల్లీ డ్రైనేజిలో వైసీపీ పరువు

ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై విరుచుకు పడడం, విమర్శలు చేయడం సహజం. అయితే, అధికార పార్టీ నాయకులే అధికార పార్టీపైనా ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం, మరీ అంత కాని పని కాకపోయినా, కొంచెం విచిత్రమే. గతంలోనూ అలాంటి ఉదంతాలున్నా నడుస్తున్న చరిత్రలో, నర్సాపురం ఎంపీ, రఘురామ కృష్ణం రాజు ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఏకంగా రెండున్నర సంవత్సరాలకు పైగా, ఆయన ప్రతి రోజూ రచ్చబండలో  ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉతికి ఆరేస్తూనే ఉన్నారు. సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. 

కృష్ణం రాజు పార్లమెంట్ సభ్యత్వం రద్దుకోసం వైసీపీ పార్లమెంటరీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్’కు  వైసీపీ ఎంపీలు అర్జీలు పెడుతూనే ఉన్నారు. అభ్యర్దిస్తూనే ఉన్నారు. మరో వంక కృష్ణం రాజు, స్వచ్చంద రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నెల 11 వరకు వైసీపీ గడువిచ్చారు. ఈ లోగా. వైసీపీ అనర్హత సాధిస్తే సరే సరి. లేదంటే, ఆతర్వాత తానే రాజీనామా చేసి, మళ్ళీ అదే నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుస్తానని జగన్ రెడ్డి పార్టీకి సవాలు విసిరారు. 

రఘురామరాజు, ట్రిపుల్ “ఆర్” ఎపీసోడ్ అలా సాగుతూ ఉంటే, ఇప్పుడు ఒంగోలు గుప్తా ఢిల్లీ వీధుల్లో వైసీపీ పరువు,జగన్ రెడ్డి పరువు తీస్తున్నారు. వైసేపీలో సొంత పార్టీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేదని,ఇప్పటికే రుజువైంది. రఘురామ కృష్ణం రాజు, వైసీపీ నాయకుల నుంచి వ్సస్తున్న బెదిరింపులు, గతంలో ఆయన్ని హైదరాబాద్’ లో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన నేపధ్యంలో ఆయన ప్రాణ భయంతో నియోజక వర్గంలో కాలు పెట్టలేదు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం, ఆయనకు ప్రత్యేక రక్షణ కూడా కలిపించింది.

ఇపుడు ఒంగోలుకు చెందిన, వైసీపీ నాయకుడు కాదంటే సీనియర్ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా.. సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా హస్తినకు వెళ్లి అమిత్ షాను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. ఢిల్లీ వెళ్లిన సుబ్బారావు నర్సాపురం ఎంపీ రఘురామను కూడా కలిశారు. అందుకు సంబదించిన ఫోటోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజానికి, సోమిశెట్టి సుబ్బారావు గుప్తాకి రాష్ట్రంలోపెద్దగా పరిచయం అవసరం లేదు. డిసెంబర్‌లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సొత పార్టీపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తీరుతో పార్టీ నష్టపోతోందని.. జనాలు వైఎస్సార్‌సీపీకి దూరమవుతున్నారని ఓపెన్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి కలకలంరేపింది. ఆ మరుసటి రోజు గుప్తా ప్రాణ భయంతో గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకున్నారు.

ఒంగోలుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత సుభానీ సుబ్బారావుపై లాడ్జిలోనే దాడి చేశారు. ఆయన్ను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఈ ఘటనపై పోలీసులు సుబానీని అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌పై వదిలేశారు. ఆ తర్వాత గుప్తా మంత్రి బాలినేనితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ట్విస్ట్ ఇచ్చారు. ఈ వివాదం అంతటితో సమసిపోయిందని భావించారు.

అయితే ఆ తర్వాత గుడివాడ కాసినో దుమారం నేపధ్యంగా గుప్తా మళ్ళీ తెర మీదకు  వచ్చారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో హాల్ చల్ చేస్తున్నారు. వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రన హాని ఉందని వివిధ రాష్ట్రాల  ఎంపీలను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్తున్నారు.  ఓ ఫ్లెక్సీ చేతబట్టుకుని జంతర్‌మంతర్‌లో ప్రదర్శన కూడా నిర్వహించారు. 

‘ఒంగోలులో నాపై, నా కుటుంబంపై దాడి చేసిన వారి నుంచి రక్షణ కల్పించండి. హోం మంత్రి అమిత్‌షాజీ నా ప్రాణాలు  కాపాడండి.. నన్ను రక్షించండి’ అని సుబ్బారావు గుప్తా విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణ రక్షణ కల్పించడంతోపాటు తన ఇంటిపై, లాడ్జిలో దాడి చేసిన వారిని.. ఈ పనిని చేయించిన వారినీ కఠినంగా శిక్షించాలని సుబ్బారావు డిమాండ్‌ చేశారు.దీంతో వైసీపీ పరువు ఢిల్లీ డ్రైనేజిలో కలిసి పోయిందని, పార్టీ నాయకులే విచారం వ్యక్త పరుస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu