చంద్రబాబుపై అవిశ్వాసం పెట్టనున్నారా?

7 నెలలుగా పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గం లో యాత్ర కొనసాగిస్తున్నారు.ఈ యాత్ర తో 100 నియోజక వర్గాల్లో యాత్ర పూర్తి అవ్వనుండటంతో యాత్రను నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది.అంతేకాకుండా వైసీపీ మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ కు ఎంపీలు రాజీనామాలు చేయడం.. అసెంబ్లీని బహిష్కరించడం జగన్ చేసుకున్న అతి పెద్ద సెల్ఫ్ గోల్స్ గా ప్రజల్లోకి వెళ్లాయి. చట్టసభలను వదిలేసి వెళ్లడం అనేది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.

 

 

ఎంపీల రాజీనామాలు ఎలాగూ వెనక్కి తీసుకోలేరు కాబట్టి.. అసెంబ్లీకి వెళ్లడం మంచిదని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన కూడా వైసీపీ చేస్తోందన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.ఈ నేపథ్యంలో జగన్.. పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఈ రెండు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయించుకుని దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది.