కిడ్నీల మీద కాస్త కనికరం చూపండి!

కిడ్నీలు మన శరీరంలో ముఖ్య అవయవాలు. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే మనం రోజూ వారీ జీవితంలో చేస్తున్న కొన్ని తప్పులు మూత్రపిండాల పనితీరుకు అడ్డంకి అవుతున్నాయి. చాలా తొందరగా పాడైపోతున్నాయి. ఎంతో చిన్న వయసులో మూత్రపిండాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే.. కిడ్నీల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా ఈ కిడ్నీ సమస్యలు మన చెప్పుచేతల్లో నుండి జారిపోయేవరకు బయటపడవు.  

ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీని ప్రపంచం కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ కిడ్నీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారవిహారాలు తెలుసుకుంటే.. 

నీళ్లు..

కిడ్నీ ఆరోగ్యానికి మంచినీరు మొదటి ఔషధం. ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. శరీరం హైడ్రేట్ గా ఉంటే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయి. మంచినీరు తగినంత తీసుకుంటే.. కిడ్నీలు వ్యర్థాలను వడపోయడం తేలిక అవుతుంది. 

ఆహారం..

ట్యూనా, సాల్మన్ లేదా ట్రౌట్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సులువుగా పొందవచ్చు.

క్యాబేజీలో పొటాషియం మరియు సోడియం రెండూ తక్కువగా ఉంటాయి, అయితే ఫైబర్, విటమిన్ C మరియు K సమృద్ధిగా ఉంటాయి.

క్యాప్సికం గా పిలుచుకునే బెల్ పెప్పర్ లో విటమిన్ B6, B9, C మరియు K,  విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో మంచి  ఫైబర్ ఉంటుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లను కూడా బాగుంటాయి.

ముదురు ఆకుకూరలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు వీటి నుండి బాగా అందుతాయి.

మన దగ్గర ఎప్పుడూ ఉండే గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ వెల్లుల్లి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే నిర్దిష్ట సమ్మేళనం ఉంటుంది. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

క్యాలి ఫ్లవర్, బ్రోకలి కిడ్నీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి.

అలవాట్లు..

ద్రవ పదార్థాల దగ్గరి నుండి, ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి. శీతల పానీయాలు, ఆల్కహాల్, ఎక్కువ పవర్ ఉన్న మందులు, కఠినమైన ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. ఫైబర్, విటమిన్ సి, తాజా ఆకుకూరలు, కూరగాయలు, ముల్లంగి, తీసుకోవడం. శారీరక వ్యాయామం. యోగా సాధన పాటించాలి.

అవయవదానం..

ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొందరు కిడ్నీ దాతలు లేక మరణిస్తున్నారు. ఇలాంటి వారి కోసం అవయవదానం చెయ్యాలి. మరణం తరువాత, ఊహించిఅని మరణాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి  మద్దతు ఇవ్వాలి.

  సంవత్సరానికి ఒకసారి అయినా వైద్యుడిని సంప్రదించి కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ ఆరోగ్యం పదిలం.

                                       ◆నిశ్శబ్ద.