నేడు ఇండియా-బంగ్లాదేశ్ మధ్య క్వార్టర్ ఫైనల్

 

ప్రపంచకప్ క్రికెట్‌లో భాగంగా గురువారం జరగనున్న రెండో క్వార్టర్ ఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు నాకౌట్ పద్ధతి ప్రకారం తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌ మాత్రం ఇండియాకి ఫేవరెట్‌గానే వుంది. వరల్డ్ కప్‌లో పెద్దగా రాణించని బంగ్లాదేశ్ ఏదో టైమ్ బావుండి క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. ఇంత వత్తిడిని ఎదుర్కొనే సత్తా ఆ చిన్న జట్టుకు లేదని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చిన భారత క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచే అవకాశం వుందని చెబుతున్నారు. ఇదిలా వుండగా మెల్‌బోర్న్‌లో మబ్బులతో కూడిన వాతావరణం వుంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం వుందని తెలుస్తోంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu