అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
posted on Mar 19, 2015 12:23PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ యాధావిధిగా ఈ రోజు కూడా ఆందోళనల మధ్య సాగింది. అయితే ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సభా సమయంపై స్పీకర్ డైరెక్షన్ ను అంగీకరించకుండా ఆయనతో వాగ్వాదానికి దిగారు. సభలో అభ్యంతరకరమైన భాషను వాడి, అనుచితంగా ప్రవర్తించినందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురువారం నాడు మూడు రోజులపాటు సస్పెండ్ చేశారు. అనంతరం దండం పెడుతూ జగన్, వైకాపా సభ్యులు సభ నుండి వెళ్లిపోయారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈనెల 23 వరకూ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ కొనసాగనుంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ సభ్యులపై సస్పెన్షన్ తీర్మానం ఇచ్చారు. సస్పెన్షన్ ను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఆ తరువాత మిగిలిన వైకాపా నేతలు కూడా సభ నుండి వాకౌట్ అయ్యారు.