రాహుల్‌ కి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు

 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓ ర్యాలీలో పార్లమెంటులో రఫేల్‌ ఒప్పందంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ..."56 అంగుళాల ఛాతీ గల వాచ్‌మ్యాన్‌ పారిపోయి ఓ మహిళకు చెప్పాడు.. సీతారామన్‌ జీ, నన్ను కాపాడండి.. నన్ను నేను కాపాడుకోలేను అని అడిగారు. రెండున్నర గంటల పాటు ఆమె ఆయనను రక్షించలేకపోయారు. నేను నేరుగా ఓ ప్రశ్న అడిగాను. యస్‌ లేదా నో అని సమాధానం చెప్పమన్నాను. కానీ ఆమె చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తప్పుపట్టింది. నోటీసులు పంపింది. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పాలని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. ఆమె రక్షణ శాఖ మంత్రి అని, ఓ పార్టీ అధ్యక్షుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను తాము ఊహించలేదని తెలిపారు. ఆయన మహిళల్ని గౌరవించాలని వెల్లడించారు.