అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేశారు.. కుప్పంలో దారుణం
posted on Jun 17, 2025 10:46AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన దారుణం కుప్పం పరిధిలోని నారాయణపురంలో జరగింది. బాధిత మహిళ శిరీష భర్త తిమ్మరాయప్ప మునికన్నప్ప అనే వడ్డీ వ్యాపారి వద్ద వద్ద రూ.80 వేలు అప్పు చేసాడు. అయితే తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి పరారయ్యడు. దీంతో అప్పు తీర్చాలంటూ శిరీషకు వేధింపులు మొదలయ్యాయి.
కూలీ పని చేస్తూ కొద్ది కొద్దిగా అప్పు కడుతున్న శిరీష సమయానికి డబ్బులు చెల్లించడంలేదంటూ ఆమెను చెట్టుకు కట్టేసి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వడ్డా వ్యాపారి మునికన్నప్పను అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. మహిళను కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన చంద్రబాబు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.