ఆ అన్నకు చెల్లే.. అందుకే మౌనం..

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, నారా భువనేశ్వరికి ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానం పై ఒక్క ఆంధ్రప్రదేశ్’లోనే కాదు, ఇటు తెలంగాణాలో ఇతర రాష్ట్రాలలోనూ, అనేక మంది ప్రముఖులు స్పందించారు. ముఖ్యంగా రేణుకా చౌదరి, కొండా సురేఖ, విజయశాంతి, డీకే అరుణ వంటి ఎదరో మహిళా నాయకులు, ఏపీ అసెంబ్లీలో జరిగిన దుర్నీతిని తప్పు పట్టారు. అసెంబ్లీలో భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. కానీ, రాష్ట్రంలో ఒక మహిళ సారధ్యంలో నడుస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం పెదవి విప్పలేదు.

నిజానికి, భువనేశ్వరి బాధను అందరికంటే కొంచెం ఎక్కువగా అర్థంచేసుకునే అనుభవం షర్మిలకు వుంది. క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హరణం, ముఖ్యంగా ఒక వివాహిత మహిళను ఏ విధంగా బాధిస్తుందో షర్మిలకు తెలుసు. గతంలో ఒక ప్రముఖ సినిమా నటుడితో ఆమెకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆమెకు వైసీపీ పార్టీ అండగా నిలిచింది. ఆమె, భర్త బ్రదర్ అనీల్, బాబాయి సుబ్బారెడ్డి ఇతర వైసీపే నాయకులను వెంట పెట్టుకుని హైదరబాద్ పోలీసు కమీషనర్ కార్యాలయానికి  వెళ్లి మరీ ఆమె ఫిర్యాదు చేశారు. అ సందర్భంగా ఆమె వ్యక్త పరిచిన ఆవేదన అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరి సంగతి ఎలా ఉన్నా ఆమెకు అయితే ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. అలాగే, ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి ..అరెస్టులు అవీ చేయడం కూడా  చాల మందికి గుర్తుండే ఉంటుంది.అప్పట్లో సభ్యత, సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరు, ఆమెకు  సానుభూతి తెలిపారు.ఆమె ధైర్యంగా బయటకు వచ్చి చేసిన ఆందోళనకు మద్దతు ఇచ్చారు. కానీ, ఇప్పుడు భువనేశ్వరికి విషయంలో ఆపాటి సంస్కారం చూపలేక పోయారు. ఆ అన్నకు చెల్లినే అని నిరుపించుకున్నారు. 

అందుకే షర్మిల,, తాను పాదయాత్ర  చేసి బతికించిన అన్న పార్టీ, సభ్యులు, ఏపీ అసెంబ్లీలో ఒక సాటి మహిళను అవమాన పరిస్తే స్పందించాలనే చిన్నపాటి విజ్ఞతను కూడా చూపలేదని, ఆమె పార్టీ మహిళా కార్యకర్తలే విస్మయం వ్యక్త పరుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణి అయినా రాజకీయాలకు దూరంగా తమ పని తాము  చేసుకుపోతున్న, ఇంచు మించుగా తమ తల్లి వయసున్న మహిళకు నిండు సభలో అవమానం జరిగితే, ఖండించక పోవడం. రాజకీయ పార్టీ నాయకురాలుగా కాకపోయినా కనీసం, ఒక మహిళా, ఒక బాధితురాలిగా అయినా స్పందించక  పోవడం దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా రాజన్న రాజ్యం. ఈ సంస్కృతిని తెలంగాణలోనూ విస్తరించేందుకేనా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, అని కూడా అడుగుతున్నారు.
 
మరో వంక అన్నా చెల్లీ, మధ్య ఏవో విబేధాలు ఉన్నాయన్నది కూడా నిజం కాదా, అందుకేనా, సభలో జరిగిన అవమానానికి పది రెట్లు ఎక్కువగా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి సభలోపలా సభ వెలుపలా అవమానం చేసినా,షర్మిల పెదవి విప్పక పోవడం అందుకేనా? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి  అన్నా చెల్లి ఇద్దరిలో ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఇద్దరూ, ఎన్ని రాజకీయ డ్రామాలు నడిపినా ఇద్దరిదీ ఒకే బ్లడ్, ఒకటే రాజకీయం .. ఒకటే సంస్కారం అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu