నామినేషన్ వేసిన రాజయ్య.. ఇంకా తేలని బీజేపీ-టీడీపీ అభ్యర్థి
posted on Nov 2, 2015 2:05PM

వరంగల్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీనుండి బరిలోకి దిగిన రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు వరంగల్ కలెక్టరేట్‌కు వచ్చిన రాజయ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజయ్య కడియం శ్రీహరి మీద మూడు లక్షల తొంభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు టీఆర్ఎస్ నుండి పసునూరి దయాకర్ రావు బరిలో దిగనుండగా.. బీజేపీ..టీడీపీ లు ఇంతవరకూ అభ్యర్థినే ఎంపిక చేయలేదు. నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడవు ఉన్నా ఈ మిత్రపక్షాలు రెండూ ఇంకా ఎవరిని ఎంపిక చేయాలా అన్న విషయంలో చర్చిస్తూనే ఉన్నారు. అయితే బీజేపీ నుండి ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దేవయ్య, మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, స్థానికంగా ప్రముఖుడైన డాక్టర్ రాజమౌళి పేర్లు చర్చలో ఉండగా ఇప్పుడు మరో ఇద్దరు చింతాస్వామి, పోలీసు అధికారి నాగరాజు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఒకరిని ఎన్నికల బరిలో దించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.