విశాఖలో టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే !
posted on Aug 30, 2025 3:34PM

ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఋషికొండ ఐటీ హిల్ లోని మిలీనియం టవర్స్ లో ఈ సంస్థ కార్యకలాపాలకు అనువుగా భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ మిలీనియం టవర్ లోని 16 17 బ్లాక్ లకు తీసేసి కంపెనీ పేరుతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. తొలిదశలో రెండు షిఫ్ట్ లలో 2000 మంది ఉద్యోగులతో కార్యకర్తల అప్పాలు ప్రారంభించనున్నారు. ఈ సంఖ్యను క్రమంగా 6000కు పైగా పెంచే అవకాశాలు ఉన్నాయి.
అందుకు తగ్గ భవనాలను మిలీనియం టవర్స్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఒప్పందం చేసుకున్న ఐటీ కంపెనీ ఇదే . తాత్కాలికంగా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తూనే శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు టిసిఎస్ ప్రయత్నిస్తుంది. 1370 కోట్ల పెట్టుబడితో 12000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళిక దిశగా ఐటి హిల్ 3 పై 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది.