విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఊరట!

ఇటీవల 4 వేల 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్లాంట్ యాజమాన్యం విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు పలు పార్టీలు, సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.  ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది.  తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. దీంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు.  తొలగించిన కార్మికులకు వారం రోజుల్లో బయోమెట్రిక్ విధానాన్ని వారం రోజుల్లోగా  పునరుద్ధరిస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలిపింది.  ప్లాంట్‌పై ఆధారపడి బతుకుతున్న తమను తీసివేయడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాం.. దిక్కు తోచని పరిస్థితిల్లోనే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu